Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందంటే..
Gold and Silver Latest Prices: వివాహాలైనా, శుభకార్యాలు జరిగినా, పండుగలున్నా.. చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.
Gold and Silver Latest Prices: వివాహాలైనా, శుభకార్యాలు జరిగినా, పండుగలున్నా.. చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.310మేర తగ్గి 60,440 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 మేర తగ్గి రూ.55.400లుగా ఉంది. అయితే, కిలో వెండి ధర.. రూ.600 మేర పెరిగి రూ.79,000లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు 55,400, 24 క్యారెట్లు 60,590, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,700, 24 క్యారెట్లు రూ.60,760, బెంగళూరులో 22 క్యారెట్లు 55,400, 24క్యారెట్లు 60,440 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్లు రూ.55,400, 24 క్యారెట్లు రూ.60,440 గా ఉంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది. ముంబైలో రూ.79,000, చెన్నైలో రూ.82,000, బెంగళూరులో రూ.77,000 లుగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.82,000లుగా ఉంది.
గమనిక.. ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. కాగా.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..