Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. సాధారణంగా శుభకార్యాలున్నా, పండుగలున్నా.. బంగారం, వెండిని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 03, 2023 | 6:17 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. సాధారణంగా శుభకార్యాలున్నా, పండుగలున్నా.. బంగారం, వెండిని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. వీటి ధరలపై ఎక్కువగా దృష్టిపెడుతుంటారు. దేశీయంగా గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.300 మేర తగ్గి రూ.55,100 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 మేర తగ్గి రూ.60,110 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.700 మేర తగ్గి రూ.77,300 లుగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,250 గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,260 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,500, 24 క్యారెట్లు రూ.60,550 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110 గా ఉంది.

వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,300 లుగా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.77,300, చెన్నైలో రూ.80,300, బెంగళూరులో రూ.76,000 లు ఉంది. హైదరాబాద్‌లో రూ.80,300, విశాఖపట్నంలో రూ.80,300, విజయవాడలో రూ.80,300లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..