Gold and Silver Latest Prices: బంగారం, వెండి ధరలు అసలు తగ్గనంటున్నాయి. గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఆకాశానంటుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.200 నుంచి రూ. 220 మేర పెరిగింది. ఇక వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరిస్తున్నాయి. శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.1600 మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76, 900 పలుకుతోంది. మరి శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం రండి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 పలుకుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ట్రేడ్ అవుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,830, 24 క్యారెట్ల ధర రూ.59,820 పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,900 లుగా ఉంది. ముంబై, కోల్‌కతాలోనూ ఇదే రేటు పలుకుతోంది. ఇక చెన్నై, కేరళలో రూ. 80,000లకు లభిస్తోంది. ఇక బెంగళూరులోరూ.75,500గా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో రూ.80,000లుగా కొనసాగుతోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..