Fixed Deposit: కెనరా బ్యాంకు వినియోగదారులకు శుభవార్త.. భారీగా పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు.. వివరాలు ఇవి..
కెనరా బ్యాంకులో 444 రోజుల వ్యవధి గల ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. దీనిలో సూపర్ సీనియర్ సిటిజెనులకు ఏకంగా 8శాతం వరకూ వడ్డీ రేటు అందిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సూపర్ సీనియర్ సిటిజన్ (80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) కోసం 0.60% అదనపు వడ్డీ రేటు బ్యాంకు అందిస్తోంది.
బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డ రేట్లు అందరికీ ఒకేలా ఉండవు. సాధారణ పౌరులకు ఒకలా.. సీనియర్ సిటిజెనులకు మరోలా ఉంటాయి. ఈ సీనియర్ సిటిజెన్స్ లో కూడా సూపర్ సీనియర్ సిటిజెన్, రెగ్యూలర్ సీనియర్ సిటిజెన్ పేరిట రెండు రకాలుగా వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే ఎఫ్ డీ రకాన్ని బట్టి కూడా వడ్డీ రేటు మారుతుంది. కాలబుల్ ఫిక్స్ డ్ డిపాజిట్ (అంటే మెచ్యూరిటీ డేట్ కన్నా కూడా ముందే విత్ డ్రాకు అనుమతించే పథకం), నాన్ కాలబుల్ ఎఫ్డీ (అంటే మెచ్యూరిటీ డేట్ కన్నా ముందు నగదు విత్ చేయలేనిది) బట్టి కూడా వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. ప్రముఖ బ్యాంక్ కెనరా బ్యాంకు తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించింది. 2023, ఏప్రిల్ 5 నుంచి కొత్త వడ్డ రేట్లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాలుగా ఉన్న ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ల గురించి ఓ సారి తెలుసుకుందాం..
కెనరా బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్..
కెనరా బ్యాంకులో 444 రోజుల వ్యవధి గల ప్రత్యేక ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. దీనిలో సూపర్ సీనియర్ సిటిజెనులకు ఏకంగా 8శాతం వరకూ వడ్డీ రేటు అందిస్తుంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సూపర్ సీనియర్ సిటిజన్ (80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) కోసం 0.60% అదనపు వడ్డీ రేటు బ్యాంకు అందిస్తోంది. అంటే కాలబుల్ డిపాజిట్‌లకు 7.85%, నాన్ కాలబుల్ డిపాజిట్లకు 8% వడ్డీ అందుతుంది. ఎనిమిది శాతం వడ్డీతో వచ్చేవి నాన్ కాలబుల్ టర్మ్ డిపాజిట్లు కాబట్టి ఇవి అకాల ఉపసంహరణకు అనుమతించవు. కెనరా బ్యాంక్‌లో కాలబుల్ డిపాజిట్‌లో కనీస పెట్టుబడి రూ.15 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకూ ఉండాలి.
Discover the power of financial security with Canara Bank’s Special Deposit Scheme. Benefit from our higher rate of interest at 8% p.a. and watch your savings grow steadily over 444 days.
Open Today: https://t.co/c6Sq57qGfw#AmritMahotsav #HigherReturns #Deposits #CanaraBank pic.twitter.com/8mS4A9RfAm
— Canara Bank (@canarabank) May 31, 2023
సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీ రేట్లు (కాలబుల్).. కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు కాలబుల్ డిపాజిట్ల కోసం 4 నుండి 7.75% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 444 రోజుల వ్యవధికి అత్యధిక వడ్డీ రేటు 7.75% అందిస్తుంది.
సీనియర్ సిటిజన్స్ ఎఫ్ డీ రేట్లు (నాన్-కాలబుల్).. కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు నాన్ కాలబుల్ డిపాజిట్లపై 5.30 నుంచి 7.90% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 444 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 7.90%గా అందిస్తుంది.
సూపర్ సీనియర్ సిటిజన్స్ ఎఫ్‌డీ రేట్లు (నాన్-కాలబుల్).. కెనరా బ్యాంక్ సూపర్ సీనియర్ సిటిజన్లకు నాన్ కాలబుల్ డిపాజిట్ల కోసం 5.40 నుండి 8% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 444 రోజుల వ్యవధిలో అత్యధికంగా 8% వడ్డీ రేటు అందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.