Canara Bank: మరో కొత్త యాప్‌ రిలీజ్‌ చేసిన కెనరా బ్యాంక్‌.. బ్యాంకింగ్‌ రంగ చరిత్రలో ఇదే మొదటిసారి

కెనరా బ్యాంక్‌ తాజాగా ఓ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. కెనరా డిజిటల్ రూపీ అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు మర్చంట్ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడానికి, అలాగే డిజిటల్ కరెన్సీని ఉపయోగించి చెల్లించడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో ఒక బ్యాంకు ఇలాంటి అప్లికేషన్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి.

Canara Bank: మరో కొత్త యాప్‌ రిలీజ్‌ చేసిన కెనరా బ్యాంక్‌.. బ్యాంకింగ్‌ రంగ చరిత్రలో ఇదే మొదటిసారి
Canara
Follow us
Srinu

|

Updated on: Aug 24, 2023 | 6:00 AM

పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా డిపాజిట్‌, విత్‌డ్రా విషయాల్లో మార్పులు అందరికీ తెలిసిందే. కానీ నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. మొదట్లో వివిధ యూపీఐ యాప్స్‌ ద్వారా సేవలందుకున్న బ్యాంకు కస్టమర్లకు ఇప్పుడు బ్యాంకులే ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్‌ తాజాగా ఓ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. కెనరా డిజిటల్ రూపీ అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు మర్చంట్ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడానికి, అలాగే డిజిటల్ కరెన్సీని ఉపయోగించి చెల్లించడానికి అనుమతిస్తుంది. భారతదేశంలో ఒక బ్యాంకు ఇలాంటి అప్లికేషన్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి. కెనరా డిజిటల్ రూపాయి యాప్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగమని తెలుస్తుంది. సీబీడీసీ అంటే ఆర్‌బీఐ జారీ చేసే భారతీయ రూపాయికు సంబంధించి డిజిటల్ వెర్షన్. ఈ తాజా యాప్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

కెనరా డిజిటల్ రూపీ యాప్ ఇప్పుడు వ్యాపారికి సంబంధించి క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడానికి, అలాగే డిజిటల్ కరెన్సీని ఉపయోగించి చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ సీబీడీసీ కోసం ప్రత్యేక ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ అవసరం లేకుండా వ్యాపారులు తమ ప్రస్తుత యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించి డిజిటల్ కరెన్సీ చెల్లింపులను ఆమోదించడానికి కూడా వీలు కల్పిస్తుంది.

ఉపయోగించడం ఇలా

కెనరా డిజిటల్ రూపీ యాప్‌ ఉన్న కస్టమర్‌లు ఇప్పుడు వ్యాపారి యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా యూపీఐ చెల్లింపులను అంగీకరించే వ్యాపారుల వద్ద వస్తువులు, సేవల కోసం చెల్లించవచ్చు. డిజిటల్ కరెన్సీని ఉపయోగించి చెల్లింపు ప్రాసెస్ అవుతుంది. యూపీఐ చెల్లింపులను అంగీకరించే వ్యాపారులు ఇప్పుడు వారి యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను ప్రదర్శించడం ద్వారా డిజిటల్ కరెన్సీ చెల్లింపులను కూడా అంగీకరించవచ్చు. డిజిటల్ కరెన్సీ చెల్లింపులను అంగీకరించడం ప్రారంభించడానికి వారు ప్రత్యేక ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం లేదు. యూపీఐ ఇంటర్‌ఆపరేబిలిటీని కలిగి ఉన్న కెనరా బ్యాంక్ డిజిటల్ రూపాయి మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించడం భారత ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌కు ఒక అద్భుతమైన అడుగు అని కెనరా బ్యాంక్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

డిజిటల్ రూపీ అంటే ఏంటి?

డబ్బు ఎలక్ట్రానిక్‌గా అందుబాటులో ఉంటే అది డిజిటల్‌గా పరిగణిస్తారు. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే డబ్బును ఎలక్ట్రానిక్ రూపీలపై గణనీయమైన ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే, డిజిటల్ డబ్బును ఆన్‌లైన్‌లో మాత్రమే వాడే అవకాశం ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.