TVS Electric Scooter: స్మార్ట్‌వాచ్‌తోనే స్కూటర్ ఆన్ అండ్ ఆఫ్.. లాంచింగ్‌కు రెడీ అయిన టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

టీవీఎస్ కంపెనీ నెమ్మదిగా త్వరలో లాంచ్ కానున్న తన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన వివరాలు బహిర్గతం చేస్తోంది. క్రెయాన్ కాన్సెప్ట్ ఆధారంగా వస్తున్న తీసుకొస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 23న నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ లాంచ్ చేయనున్నట్లు టీవీఎస్ ప్రకటించింది. ఇటీవల దీనికి సంబంధించిన రెండు టీజర్లను విడుదల చేసింది. మొదటి టీజర్లో త్వరలో కొత్త వాహనాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన టీవీఎస్, రెండో టీజర్ లో ప్రధానమైన ఫీచర్లను రివీల్ చేసింది.

TVS Electric Scooter: స్మార్ట్‌వాచ్‌తోనే స్కూటర్ ఆన్ అండ్ ఆఫ్.. లాంచింగ్‌కు రెడీ అయిన టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
Tvs I Qube
Follow us

|

Updated on: Aug 19, 2023 | 7:30 AM

దేశంలోని ద్విచక్ర వాహనాల్లో మంచి పేరున్న బ్రాండ్లలో టీవీఎస్ కూడా ఒకటి. అనువైన ధరల్లో ఉత్తమ పనితీరు కలిగిన బైక్లు, స్కూటర్లను అందిస్తోంది. ఈ కంపెనీ నుంచి త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. ఇప్పటి వరకూ ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ కు జోడిగా ఈ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది. కంపెనీ విడుదల చేసిన వరుస టీజర్లలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. అంతేకాక కొత్త స్కూటర్లో అత్యాధునిక ఫీచర్లను జోడించినట్లు సూచన ప్రాయంగా తెలియజేసింది. టీఎఫ్టీ స్క్రీన్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీతో వస్తోందని ప్రకటించింది. టీవీఎస్ క్రెయాన్ ఆధారంగా వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆగస్టు 23న టీవీఎస్ గ్లోబల్ ఈవెంట్..

టీవీఎస్ కంపెనీ నెమ్మదిగా త్వరలో లాంచ్ కానున్న తన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన వివరాలు బహిర్గతం చేస్తోంది. క్రెయాన్ కాన్సెప్ట్ ఆధారంగా వస్తున్న తీసుకొస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 23న నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్ లాంచ్ చేయనున్నట్లు టీవీఎస్ ప్రకటించింది. హోసుర్ బేస్డ్ మ్యానుఫ్యాక్చర్ ఇటీవల దీనికి సంబంధించిన రెండు టీజర్లను విడుదల చేసింది. మొదటి టీజర్లో త్వరలో కొత్త వాహనాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన టీవీఎస్, రెండో టీజర్ లో ప్రధానమైన ఫీచర్లను రివీల్ చేసింది. వాటిల్లో టీఎఫ్టీ డిస్ ప్లే ఒకటి. పాత మోడల్ స్కూటర్ లో ఇది ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఈ టీఎఫ్ టీ డిస్ ప్లే ఇప్పటికే ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో వినియోగించారు. ఈ టీజర్ ఆధారంగా వినియోగదారులకు అవసరమైన ఫీచర్లను సాంకేతిక సొబగులను అద్ది తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

రెండో టీజర్లో స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఫీచర్ గురించి రివీల్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో స్కూటర్ ను స్మార్ట్ వాచ్ సాయంతోనే లాకింగ్, అన్ లాకింగ్ చేయొచ్చని చూపించింది. రిమోట్ లా కూడా దీనిని వినియోగించవచ్చని వివరించింది.

ఇతర వివరాలు..

ఈ స్కూటర్ కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, రేంజ్, బ్యాటరీ వంటి వివరాలు టీవీఎస్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే వారంలో తెలిసే అవకాశం ఉంది. దీనిలో క్రెయాన్ కాన్సెప్ట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. దీని పేరు కూడా ఇంకా కంపనీ ప్రకటించలేదు.

ధర ఎంత ఉండొచ్చు..

టీవీఎస్ నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయాన్ని పరిశీలిస్తే ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7లక్షలు(ఎక్స్ షోరూం) ఉండే అవకాశం ఉంది. ఇది ఓలా ఎస్ 1 ప్రో, ఏథర్ 450ఎక్స్, సింపుల్ వన్ వంటి స్కూటర్లకు పోటీ నిస్తుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..