S Srinivasa Rao

S Srinivasa Rao

Senior Staff Reporter - TV9 Telugu

srinivasarao.seemala@tv9.com

హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.

Read More
Bears Attack: గ్రామంలో యదేచ్చగా ఎలుగుబంట్ల సంచారం.. గజగజలాడిపోతున్న స్థానికులు

Bears Attack: గ్రామంలో యదేచ్చగా ఎలుగుబంట్ల సంచారం.. గజగజలాడిపోతున్న స్థానికులు

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో జీడి, కొబ్బరి తోటల్లో తిష్ట వేస్తూ వ్యవసాయ పనులకోసం తోటలోకి వెళ్లే రైతులు, రైతు కూలీలపై దాడులు చేసే ఎలుగుబంట్లు ఇటీవల కాలంలో తరచూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి‌. మందస మండలం మల్లెనవారి పేట గ్రామంలోకి సోమవారం రాత్రి మూడు ఎలుగుబంట్లు చొరబడి హల్ చల్ చేసాయి. గ్రామ వీధుల్లో రాత్రంతా యదేచ్చగా సంచరిస్తూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి..

Independence Day 2023: పొందూరు చేనేత కార్మికులకు ఎర్రకొట సాక్షిగా అరుదైన గౌరవం.. ప్రధాని మోదీతో..

Independence Day 2023: పొందూరు చేనేత కార్మికులకు ఎర్రకొట సాక్షిగా అరుదైన గౌరవం.. ప్రధాని మోదీతో..

అందరిని మెరిపించే అసలు సిసలు అందాల ఇంద్రధనసులు అవి. ఆ ప్రత్యేకతలే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ కార్మికులను ఢిల్లీకి తీసుకెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చారిత్రిక ఎర్రకోటలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రేత్యక ఆహ్వానితులుగా పాల్గొనేలా చేసింది. కేంద్ర ప్రభుత్వం 'జన్ భాగీదారి' దార్శనికతకు అనుగుణంగా దేశంలోని..

Srikakulam Ponduru Khadi: శతాబ్దం దాటినా చెక్కుచెదరని వస్త్ర వైభవం పొందూరు ఖాదీ.. ఈ వస్త్రానికి కొత్త కిరీటం.. కేంద్రం విశిష్ట ఆతిథ్యం

Srikakulam Ponduru Khadi: శతాబ్దం దాటినా చెక్కుచెదరని వస్త్ర వైభవం పొందూరు ఖాదీ.. ఈ వస్త్రానికి కొత్త కిరీటం.. కేంద్రం విశిష్ట ఆతిథ్యం

పొందూరు ఖాదీ ఉత్పత్తిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. తమ కురులను సవరించుకున్నంత సున్నితంగా వారు పత్తి కాయలోని ఒక్కో పోగునూ బైటికి తీస్తారు. నిజానికి పొందూరు ఖద్దరు నెయ్యడం అంటే ఆషామాషీ కాదు. అత్యంత క్లిష్టమైన తర్ఫీదు అవసరం. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్త బరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం.. ఇలా ఎనిమిది దశలు దాటితే తప్ప పత్తి శుద్ధి కాదు

Andhra Pradesh: లంచం కావాలని అడిగిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారి.. చివరికి ఊహించని ట్విస్ట్

Andhra Pradesh: లంచం కావాలని అడిగిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారి.. చివరికి ఊహించని ట్విస్ట్

Srikakulam News: లంచం తీసుకోవడం సమాజానికి ఓ పెనుభూతంగా తయారవుతోంది. అవినీతి నిరోధక శాఖ దాడులు జరుపుతున్నా.... చట్టాలు శిక్షలు విధిస్తున్న లంచగొండితనాన్ని మాత్రం రూపుమాపటం వీలుకావటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి దురాగతాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చివరికి పేదవానికి కూడా న్యాయం జరగలాన్నా, అతని సమస్యలు తీరాలన్న అధికారులకు లంచం ఇవ్వాల్సిందే.

గంజాయితో పట్టుబడ్డ రంజీ మాజీ క్రికెట్ ప్లేయర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 వరకు చీటింగ్ కేసులు..

గంజాయితో పట్టుబడ్డ రంజీ మాజీ క్రికెట్ ప్లేయర్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 వరకు చీటింగ్ కేసులు..

Srikakulam News: ప్రముఖుల పేర్లు చెప్పి వరుస మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు నాగరాజు. మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ పేరు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలకు ఫోన్ లు చేసి వర్థమాన రంజీ క్రికెటర్ నాగరాజుకి స్పాన్సర్‌ చేయాలని పెద్ద మొత్తంలో రూ.లక్ష లను తన బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకుని మోసాలకు పాల్పడ్డాడు.బాధితుల ఫిర్యాదులతో పలుమార్లు కాటకటాల పాలయ్యాడు. ఆ తురువాత కూడా తగ్గేదే లే అన్నట్టు నేరాలకు పాల్పడుతునే ఉన్నాడు. బెయిల్ పై రావటం మళ్ళీ మోసాలకు పాల్పడటం..

Minister Seediri Appalaraju: నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల వ్యవదిలో ఎన్నికలు.. కేడర్‌కి స్పష్టం చేసిన మంత్రి..

Minister Seediri Appalaraju: నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల వ్యవదిలో ఎన్నికలు.. కేడర్‌కి స్పష్టం చేసిన మంత్రి..

Srikakulam News: పూర్తి కాలం అధికారంలో ఉండేకే ఎన్నికలకు వెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలతో ఎన్నికలపై ఏపీ ప్రజలు అయోమయానికి గురవుతూ ఉంటే.. ఉత్తరాంధ్రకు చెందిన ఓ రాష్ట్ర మంత్రి తన క్యాడర్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరిలోనే ఏపీలో ఎన్నికలకు..

Blue Whale: సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన బ్లూ వేల్ డెడ్ బాడీ .. సెల్ఫీల కోసం ఎగబడిన జనం..

Blue Whale: సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన బ్లూ వేల్ డెడ్ బాడీ .. సెల్ఫీల కోసం ఎగబడిన జనం..

భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో ఈ నీలి తిమంగళంను చూసేందుకు పెద్ద సంఖ్యలో చుట్టూ పక్క గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు. నీలిరంగు తో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది.

Andhra Pradesh: చెరువుని తలపించిన ఆర్టీసీ కాంప్లెక్స్.. వరద నీటిలో తేలియాడిన సామగ్రి.. సిబ్బంది, ప్రయాణీకులకు ఇబ్బందులు

Andhra Pradesh: చెరువుని తలపించిన ఆర్టీసీ కాంప్లెక్స్.. వరద నీటిలో తేలియాడిన సామగ్రి.. సిబ్బంది, ప్రయాణీకులకు ఇబ్బందులు

భారీ వర్షం కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లోని విశాఖపట్నం నాన్ స్టాప్ బస్ సర్వీస్ టికెట్ కౌంటర్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలోనే ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద క్యూలైన్లో నిలబడి టికెట్లు తీసుకోగా.. కౌంటర్ల లోపల ఉన్న ఆర్టీసీ సిబ్బంది సైతం వరద నీటిలోనే విధులు నిర్వర్తించారు. కాంప్లెక్స్ లోని దుకాణాలను సైతం వరద నీరు ముంచెత్తింది.

Srikakulam: ప్రమాదాన్ని గ్రహించి.. అధికారుల దృష్టికి తీసుకు వెళ్దామనుకొని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

Srikakulam: ప్రమాదాన్ని గ్రహించి.. అధికారుల దృష్టికి తీసుకు వెళ్దామనుకొని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

అప్పటికే సమస్యను విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లామని అయినా వారు స్పందించలేదని స్థానికులు చెప్పడంతో.. తెగిపోయిన విద్యుత్ వైర్లను మొబైల్ లో వీడియో తీసి అధికారులకు పంపాలని భావించాడు. తన ఫోన్ లో వీడియో తీస్తుండగా తెగి వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ పొరపాటున వసంత్ కుమార్ కి తాకింది.

Andhra Pradesh: ఆ ఊళ్లో దేవుడికి కాదు.. మహాత్మా గాంధీకి పూజలు చేస్తారు.. కారణం ఏంటో తెలుసా?

Andhra Pradesh: ఆ ఊళ్లో దేవుడికి కాదు.. మహాత్మా గాంధీకి పూజలు చేస్తారు.. కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని లేదా పంటలు బాగా ఉండాలని విల్లేజిల్లో గ్రామ దేవత ఉత్స వాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మేళతాళాలతో ఊరు ఊరంతా కదిలి వెళ్లి అమ్మవారికి ముర్రాటలు, బోనాలు సమర్పించుకుంటారు.

Andhra Pradesh: కర్రసాముతో ఇరగదీసిన ఎమ్మెల్యే.. ట్యాలెంట్ చూసి అవాక్కైన ప్రజలు..

Andhra Pradesh: కర్రసాముతో ఇరగదీసిన ఎమ్మెల్యే.. ట్యాలెంట్ చూసి అవాక్కైన ప్రజలు..

రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడు మంది మార్భలము ఉంటుంది. అందులోకి ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్ లు కూడా ఉంటారు. కానీ ప్రతి వ్యక్తికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ముఖ్యమే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజక వర్గం వైసిపి ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ కర్ర సాములో ప్రావీణ్యం సంపాదించారు.

Arasavalli Temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్న మెగా హీరో..

Arasavalli Temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్న మెగా హీరో..

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి 2014 లో వచ్చానని ఆతరువాత మళ్ళీ ఇదే రావటమని ఈ సందర్భంగా సినీ హీరో సాయి ధరంతేజ్ తెలిపారు. ఆరోగ్యం బాగుండాలని స్వామి వారిని మొక్కుకున్నట్లు చెప్పారు. తాను నటించిన బ్రో మూవీ ట్రెయిలర్ శనివారం విడుదలవుతుందని, ఈనెల 28న సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు.