Peddaprolu Jyothi

Peddaprolu Jyothi

Correspondent - TV9 Telugu

jyothiz.peddaprolu@tv9.com

ఎలక్ట్రానిక్ మీడియాలో ఎనిమిది ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో యాంకర్ గా కెరియర్ ప్రారంభం అయింది.. 2017లో జెమినీలో ,స్టూడియో ఎన్ లో యాంకర్ గా పనిచేశాను.. 2018లో టీవీ9 లో హైదరాబాద్ స్టేట్ బ్యూరోలో రిపోర్టర్ గా వర్క్ చేశాను.. 2021లో ఎన్టీవీలో హైదరాబాద్ స్టేట్ బ్యూరోలో రిపోర్టర్ గా వర్క్ చేశాను …2023లో అంటే ప్రస్తుతం తిరిగి టీవీ9 లో హైదరాబాద్లో స్టేట్ బ్యూరోలో రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను

Read More
Ganja Smuggling: హైదరాబాద్‌లో పోలీసుల సీక్రెట్‌ ఆపరేషన్‌.. భారీ ఎత్తున గంజాయి పట్టివేత

Ganja Smuggling: హైదరాబాద్‌లో పోలీసుల సీక్రెట్‌ ఆపరేషన్‌.. భారీ ఎత్తున గంజాయి పట్టివేత

గోల్కొండ పోలీసులు, నార్కోటిక్ బృందం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన ఆపరేషన్ ల్ గంజాయి విక్రయిస్తున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో పదిమంది వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో ఎస్పి గుమ్మి చక్రవర్తి తెలిపారు. అరెస్ట్ అయినా..

Hyderabad: నగరంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఇటీవల వరసగా..

Hyderabad: నగరంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఇటీవల వరసగా..

హైదరాబాద్‌ పరిధిలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ కొంతమంది మృగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. నేడు అనేక రూపాల్లో మహిళల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మహిళలను రక్షించే బాధ్యత కేవలం పోలీసులు, ప్రభుత్వాలదే కాదు.. పౌర సమాజానిది కూడా. కుటుంబం నుంచి విద్యా సంస్థల వరకు స్త్రీలను గౌరవించే సంస్కృతిని పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Hyderabad: మిస్ అయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి వారి అదుపులోనే ఉన్నారు..

Hyderabad: మిస్ అయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి వారి అదుపులోనే ఉన్నారు..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరన్ చౌదరి మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుండి కనబడకుండా పోయిన శరణ్ చౌదరిపై భార్య అమూల్య మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన శరన్ చౌదరినీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది భార్య అమూల్య.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్.. కత్తులతో బెదిరించి..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్.. కత్తులతో బెదిరించి..

Gang Rape on Minor Girl in Meerpet: ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మహిళలు, బాలికలపై ఆత్యాచారయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయ, పోక్సో లాంటి కఠిన చట్టాలను తీసుకువచ్చినా నిందితులు.. ఎలాంటి భయం బెదురు లేకుండా దారుణ ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాలికలపై అత్యాచార యత్నాలు పెరిగాయంటూ రిపోర్టులు చెబుతున్నాయి.

Hyderabad: వీడు భర్త కాదు కాలయముడు.. భార్య సహా ఆమె కుటుంబ సభ్యులపై విష ప్రయోగం.. లండన్ నుంచే..

Hyderabad: వీడు భర్త కాదు కాలయముడు.. భార్య సహా ఆమె కుటుంబ సభ్యులపై విష ప్రయోగం.. లండన్ నుంచే..

భార్యతో విభేదాల కారణంగా ఏకంగా ఆమెను ఆమె కుటుంబ సభ్యులపై విష ప్రయోగం చేశాడు ఓ భర్త.. లండన్ నుంచి వచ్చి మరి భార్యతో సహా ఆమె కుటుంబ సభ్యులపై విషప్రయోగం చేయించాడు. అయితే ఈ విషయం వెలుగులోకి రాకముందే అత్త ప్రాణాలను కోల్పోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad: 8 నెలల వయసులోనే నోబెల్ రికార్డ్.. 300 ఫోటోలను, 30 దేశాలను అలవోకగా గుర్తిస్తున్న చిన్నారి..

Hyderabad: 8 నెలల వయసులోనే నోబెల్ రికార్డ్.. 300 ఫోటోలను, 30 దేశాలను అలవోకగా గుర్తిస్తున్న చిన్నారి..

Hyderabad: 8 నెలల వయసులోనే అత్యంత మెండైన గ్రాహకశక్తితో అబ్బురపరుస్తోంది ఓ చిన్నారి.. ఈ వయసులోనే నోబెల్ ప్రపంచ రికార్డు బుక్‌లో స్థానం సంపాదించి అందరినీ ఔరా అనిపించింది. ఇంతకీ ఎవరా పాప..? ఆ పాపకు ఉన్న ప్రత్యేకత ఏంటి అనే కదా మీ డౌట్..? ఇప్పుడే తెలుసుకుందాం రండి.. హైదరాబాద్ సమీపంలోని మల్కాజిగిరి బలరాం నగర్‌లో నివసించే లక్ష్మి ప్రసన్న, మణికంఠ దంపతులకు 8 నెలల కుమార్తె.. పేరు అధ్యశ్రీ.. పుట్టిన రోజు నుండి చిన్నారి ఎంతో యాక్టివ్‌గా

Hyderabad : అయ్యో పాపం.. కాబోయే అమ్మ..! రెండో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి..

Hyderabad : అయ్యో పాపం.. కాబోయే అమ్మ..! రెండో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి..

జుగ్నక కవితకు రాత్రి 8 గంటల సమయంలో నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి సరైన దారి, వాహన సదుపాయం, లేకపోవడంతో పాటు 4 కి. మీ వెళితేనే ఆటో సౌకర్యం ఉంటుంది. తప్పని పరిస్థితిలో ఎడ్లబండిపైనే తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలోనే 2 కి. మీ వెళ్లాక నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే అంటే అడవిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం..

Hyderabad Begging Mafia: హైదరాబాద్ బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు.. దందా జరిగే తీరు, సంపాదన ఎంతో తెలిస్తే షేక్ అవుతారు..

Hyderabad Begging Mafia: హైదరాబాద్ బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టు.. దందా జరిగే తీరు, సంపాదన ఎంతో తెలిస్తే షేక్ అవుతారు..

Hyderabad Begging Mafia: హైదరాబాద్‌లో అనిల్‌ పవార్‌ అనే వ్యక్తి బెగ్గింగ్‌ మాఫియాకు తెరతీశాడు. ముసలి వాళ్లను తీసుకువచ్చి వారితో బిక్షం ఎత్తిస్తూన్నాడు. జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ దగ్గర బిక్షటన చేయిస్తూన్నాడు. వారు రోజంతా కష్టపడి సంపాదించినది తాను తీసుకుని, వారికి రూ. 200 కూలి ఇస్తున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు బెగ్గింగ్‌ మాఫియా గుట్టు రట్టు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద బిక్షం ఎత్తుకుంటున్న..

Hyderabad: క్యూనెట్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌.. రూ.కోట్ల స్కాంలో ఇప్పటివరకు ఎంతమంది చిక్కారంటే..?

Hyderabad: క్యూనెట్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్‌.. రూ.కోట్ల స్కాంలో ఇప్పటివరకు ఎంతమంది చిక్కారంటే..?

Secunderabad Qnet case : ఒకప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్ అనగానే అక్కడ రద్దీ షాపింగ్.. ఉద్యోగుల హడావుడి.. పండుగలు వస్తే చాలు కళకళలాడుతూ కనిపించేది. కానీ ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్ అనగానే ఇటీవల జరిగినటువంటి భారీ అగ్నిప్రమాదమే గుర్తువస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన తర్వాత అతిపెద్ద భారీ మోసం తెర మీదకు వచ్చింది.

Hyderabad: ఇక బ్రతకదనే అకున్నారంతా.. అంతలోనే అవయవదానం చేసి అర్థాంగికి ప్రాణం పోశాడు

Hyderabad: ఇక బ్రతకదనే అకున్నారంతా.. అంతలోనే అవయవదానం చేసి అర్థాంగికి ప్రాణం పోశాడు

హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపులో నొప్పితో పాటు కామెర్లు ఉండి నెల కిందట ఫిట్స్‌ రావడంతో బెడ్‌కే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో కోమాలోకి వెళ్లిన తీరుతో ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారం మించి బతకదని చెప్పినట్లు, దాంతో వారు లక్డీకపూల్ లోని గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకోచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి లోని వైద్యుల బృందం నేతృత్వంలో రోగిని పరిశీలించగా క్రోనిక్‌ లివర్‌ ఫెయిల్యూర్‌గా గుర్తించారు. అనంతరం ఎవరైనా దాతలు లివర్‌ ఇస్తే..

సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు వల.. యువతి ఆత్మహత్యతో వెలుగులోకి దారుణాలు

సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు వల.. యువతి ఆత్మహత్యతో వెలుగులోకి దారుణాలు

హైదరాబాద్‌లోని మణికొండ సమీపంలో ఉండే ల్యాంకోహిల్స్.. ఎల్లుప్పుడు రక్షణగా ఉండే భద్రతా సిబ్బంది. చుట్టూ సీసీటీవీకెమెరాలు, ఇంతటి రక్షణ చర్యలున్నప్పటికీ కూడా లోపల జరుగుతున్న దారుణాల స్థానికులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిరోజు వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇప్పుడు తాజాగా మణికొమడ ల్యాంకోహిల్స్ అపార్ట్‌మెంట్‌లో బిందుశ్రీ (28) అనే యువతి 21 వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట.. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట.. ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోట ముస్తాబవుతుంది ఇప్పటికే గోల్కొండలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్. ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించిన డిజిపి ..గోల్కొండ కోటలో జరుగుతున్న రిహార్ సేల్స్ ను పరిశీలించారు.ఆగస్టు 15న సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటకు చేరుకుంటారు. అనంతరం గోల్కొండ లోని రాణి మహల్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ అధికారులను సూచించారు.