Horoscope Today (March 17, 2023): ఆ రాశివారికి ఉద్యోగపరంగా శుభయోగం.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Daily Horoscope Today: 12 రాశుల వారికి శుక్రవారం (మార్చి 17) దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (March 17, 2023): ఆ రాశివారికి ఉద్యోగపరంగా శుభయోగం.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today (March 17, 2023)Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Mar 17, 2023 | 6:24 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు చాలావరకు సమయం అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఇవి కూడా చదవండి

సొంత ఊర్లోనే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కలిసి వస్తుంది. వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగపరంగా శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులని ఆదుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధు వర్గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రమ మీద కొన్ని వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కీలకమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. అవసరాలకు తగ్గట్టు డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆదాయానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఊహించని విధంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం తో పాటు అనవసర ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు బాగానే ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రమ ఫలించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సన్నిహితుల సహకారంతో ఒక వ్యక్తిగత వ్యవహారం పరిష్కారం అవుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

ధనుస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగరీత్యా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అవసరమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వాదనలకు దూరంగా ఉండండి. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. మిత్రుల సహాయ సహకారాలతో ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన లాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా ప్రయోజనం పొందుతారు.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..