Chandra Mangal Yoga: ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. చంద్ర మంగళ యోగంతో వారి జీవితాలు మారిపోతాయ్..
కుజ, చంద్రుల కలయికకు చంద్ర మంగళ యోగం అని పేరు. ఈ యోగం వల్ల ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈ యోగం జాతక చక్రం లోనే కాకుండా గ్రహచారంలో కూడా వర్తిస్తుంది.
Vedic Astrology In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుజ, చంద్ర గ్రహాల కలయికకు ఒక విశిష్ట స్థానం ఉంది. కుజ, చంద్రుల కలయికకు చంద్ర మంగళ యోగం అని పేరు. ఈ యోగం వల్ల ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈ యోగం జాతక చక్రం లోనే కాకుండా గ్రహచారంలో కూడా వర్తిస్తుంది. చంద్రుడికి ఒకటి, నాలుగు, ఏడు, పదవ స్థానాలలో కుజుడు ఉన్నా లేక సంచరిస్తున్నా ఈ చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం కుజగ్రహం వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించింది. అందువల్ల మిథునం, కన్య, ధనస్సు, మీనరాశుల వారికి ఈ యోగం పట్టింది.
ఈ యోగం ఫలితాలు
ఈ చంద్రమంగళ యోగం వల్ల ప్రధానంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుదల, సంపాదనలో వృద్ధి, అత్యధిక లాభాలు, రాదను కుని వదిలేసుకున్న డబ్బు తిరిగి రావటం, మొండి బాకీలు వసూలు కావడం, ఆస్తి విలువ పెరగటం, వడ్డీ వ్యాపారం లాభసాటిగా మారటం, ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలగటం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదో ఒక రూపేణా ఆర్థిక ప్రయోజ నాలు పెంపొందడం ఈ యోగం ప్రధాన లక్షణం. కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్త, ధనిష్ట, చంద్ర నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వారు కూడా ఈ యోగ ఫలితాలను అనుభవించడం జరుగుతుంది.
మిథున రాశి
ప్రస్తుతం కుజ గ్రహం ఈ రాశిలో సంచరిస్తోంది. ఈ ఏడాది మే 10వ తేదీ వరకు అది ఏ రాశిలోనే ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారి సంపాదన ఆశించిన స్థాయిలో పెరగటానికి అవకాశం ఉంది. ఉద్యోగుల ఆదాయం తప్పకుండా పెరుగుతుంది. భారీ మొత్తంలో ఇంక్రిమెంటు చేతికి అందే అవకాశం ఉంది. వ్యాపార లాభాలు రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి నిపుణుల ఆదాయం గణనీయంగా పెరగవచ్చు. అయితే, ఈ రాశి వారు కొద్దిగా లౌక్యంగా వ్యవహరించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. కోపతాపాలకు కళ్లెం వేయటం మంచిది. సుబ్రహ్మణ్యస్వామికి మధ్య మధ్య అర్చన చేయించడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
కన్యా రాశి
ఈ రాశి వారికి దశమ స్థానంలో అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ స్థానంలో చంద్రమంగళ యోగం చోటు చేసుకుంటుంది. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. ఆస్తి విలువ ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరుగు తుంది. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. జూదం ద్వారా కూడా ఆర్థికంగా లబ్ధి పొందటానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఇతరుల వ్యవహా రాల్లో తలదూర్చడం వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి.
ధను రాశి
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజ, చంద్రుల కలయిక సంభవిస్తుంది. అందువల్ల ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారంలో ఊహించ నంతగా అదృష్టం పండుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాబిస్తుంది. వడ్డీ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ధన సంపాదనలో కొత్త పుంతలు తొక్కుతారు. రియల్ ఎస్టేట్ వారికి డిమాండ్ పెరిగి, విపరీతంగా లాభాలు గడిస్తారు. మొత్తం మీద ఆర్థికపరంగా జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలని చేజిక్కించుకుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వినాయకుడికి అర్చన చేయించడం చాలా మంచిది. వివాదాలు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం అవసరం.
మీన రాశి
ఈ రాశి వారికి నాలుగో స్థానంలో చంద్ర మంగళ యోగం చోటు చేసుకుంటుంది. దీనివల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. తల్లి దండ్రుల నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వారసత్వ సంపద అభివృద్ధి చెందుతుంది. ఇల్లు, స్థలాలను కొనే అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఆదాయం అనూహ్యంగా పెరిగే సూచనలు ఉన్నాయి. జీవనశైలి, జీవన విధానం పెను మార్పులకు లోనవుతాయి. సరికొత్త ఆదాయ మార్గాలు ఈ రాశి వారికి అందుబాటు లోకి వస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు, ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యస్వామిని కొలవటం వల్ల శుభ ఫలితాలను అనుభవించవచ్చు. ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది.
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..