Horoscope Today: వారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..
Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 22, 2023న(మంగళవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహనక్షత్రాలు మంగళవారంనాడు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా..? ఆరోగ్యం, ఆర్థికపరంగా మీ జాతకం ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు సానుకూలంగానే ఉన్నాయా..? ఆగస్టు 22, 2023న(మంగళవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఇంట్లో ఒక శుభకార్యం జరపడానికి కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేస్తారు. అదనపు ఆదాయ మార్గాలు మరింతగా పెరుగుతాయి. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనేక బాధ్యతలను ఏక కాలంలో నిర్వర్తించడం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో పాటు ఒత్తిడి కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకో కుండా ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగి, పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కొందరు దూరపు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తలపెట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శన చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకా శాలు పెరుగుతాయి. విద్యార్థుల మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థికపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): మీ ఆలోచనలు, ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు ఇబ్బంది కలిగిస్తారు. వ్యక్తిగతంగా ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడ తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు బాగుంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): చేపట్టిన పనులలో కొన్ని అవాంతరాలు, అవరోధాలు తప్పకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన వ్యవ హారాల్లో అనవసర జాప్యం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో తరచూ నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపా రాల్లో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలుంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరమనిపిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శత్రు, రోగ, రుణ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతంగా పూర్తవు తుంది. అత్యవసర వ్యవహారాలు, పనులు సకాలంలో సంతృప్తికరంగా ముగుస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా ఉన్నతి సాధిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూ లంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగా లలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం సంపాదించుకుం టారు. సహోద్యోగులకు సహకారం అందజేస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): తొందరపడి ఎవరికీ ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు చేతికి అందే అవ కాశం ఉంది కానీ, ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతం లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. అధికారులకు మీ ఆలోచనలు, ప్రణాళికలు నచ్చుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.