Horoscope Today: 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు.. వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. !

Daily Horoscope in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి దిన ఫలాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 18, 2023న(శుక్రవారం) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు.. వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు.. !
Horoscope 18th August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 18, 2023 | 5:05 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధి కారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవం తంగా ముందుకు సాగుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగు తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆదాయం పెరిగినప్పటికీ అంతకు మించి ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. తల పెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన సౌకర్యం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యో గాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తులలో కూడా ఆర్థిక పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో అధి కారుల ప్రశంసలు అందుకుంటారు. అయితే, అదనపు బాధ్యతల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంవారు లాభాల పంట పండించు కుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు సరిపడ డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపారాలలో ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణా లను వాయిదా వేయడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): నిరుద్యోగులు విదేశీ కంపెనీల నుంచి కూడా సానుకూల సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనా లకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్త వుతాయి. ఆదాయం, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతులకు కూడా ఆస్కారం ఉంది. అవసరానికి ధనం వసూలు అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవ హారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందు తుంది. ఇంట్లో మరమ్మతులు చేపట్టి, కొన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఒకటి రెండు కుటుంబ వ్యవహారాలను అత్యవసరంగా చక్కబెట్టాల్సి వస్తుంది. ఉద్యోగంలో కూడా బరువు బాధ్యతలు ఎక్కువవుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడడం ప్రారంభిస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ బతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రోజంతా సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి ప్రయ త్నాలు కలిసి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపరంగా ఆశించిన సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరి ష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ వృత్తి అయినప్పటికీ, బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి