Monsoon updates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు.. మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..

లేదంటే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశ ఉంది. రేపు, ఎల్లుండి కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Monsoon updates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు.. మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం..  ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..
Hyderabad Rains
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 12, 2023 | 10:04 PM

Monsoon updates: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒక వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. గుజరాత్, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. శనివారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడి ఉంది. దీనికి అదనంగా, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం. ఆగస్టు 15 నుంచి ఉత్తరాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని, అక్కడక్కడా మాత్రమే చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోవు మూడు రోజులకు ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతుందో అమరావతి వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలలో ఈరోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటె 3 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల వేడి, తేమ అసౌకర్య వాతావరణం ఉంటుందని చెప్పారు. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగం వీచే అవకాశముందన్నారు.

ఇక ఎల్లుండి నుండి తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి,రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గాలితో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఉంటుందన్నారు. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 3 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉంటాయన్నారు. వేడి, తేమ, అసౌకర్య వాతావరణము ఒకటి, రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఇక రేపు, తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 3 నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశముంది. వేడి,తేమ అసౌకర్య వాతావరణం ఒకటి రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగం వీచే అవకాశముంది.

ఎల్లుండి తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఉంటుంది. గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది.

అటు రాయలసీమలోనూ ఈ రోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లేదంటే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశ ఉంది. రేపు, ఎల్లుండి కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..