Tiger: రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన వాహ‌నం.. కదలలేని స్థితిలో కాళ్లు ఈడ్చుకుంటూ.. హృదయ విదారక వీడియో వైరల్‌..

ఎలాగోలా కిందపడిపోయిన పులి రోడ్డు దాటుకుని అడవిలోకి వెళ్లిపోయింది. అయితే, రోడ్డుపై పులి క‌ద‌ల్లేని స్థితిలో ఉన్న విష‌యాన్ని కొందరు వాహ‌న‌దారులు గ‌మ‌నించారు. ఎక్కడి వారు అక్కడే వాహ‌నాల‌ను ఆపేశారు. పులి రోడ్డుపై ప‌డి ఉన్న దృశ్యాల‌తో పాటు అడ‌విలోకి వెళ్లిన దృశ్యాల‌ను మొత్తం త‌మ ఫోన్ల‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైర‌ల్ చేశారు. పులి దీన‌స్థితిని చూసి జంతు ప్రేమికులు చలించిపోయారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అట‌వీ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఘటన చోటు చేసుకుందని తెలిసింది.

Tiger: రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన వాహ‌నం.. కదలలేని స్థితిలో కాళ్లు ఈడ్చుకుంటూ.. హృదయ విదారక వీడియో వైరల్‌..
Tiger Dies
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 12, 2023 | 7:59 AM

అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల గుండా వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు కూడా తక్కువ వేగంతో నడపాలని సూచిస్తారు.. అటవీ మార్గంలోని రహదారుల గుండా వెళ్లే జంతువులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని చెబుతుంటారు. కానీ, మితిమీరిన వేగంతో వెళ్తూ కొందరు వాహనదారులు మూగజీవాలను ప్రమాదాల్లో పడేస్తుంటారు. తాజాగా కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో కారు ఢీకొని గాయపడిన పులి కనిపిస్తుంది.

IFS పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్వీట్ చేసి, అడవి జంతువులకే అడవి ప్రదేశాల మార్గాలపై మొదటగా హక్కు ఉందని రాశారు. ఇంకా, వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ.. ఈ ప్రదేశాలలో ఎల్లప్పుడూ సురక్షితంగా, తక్కువ వేగంతో డ్రైవ్ చేయండి’ అని రాశారు. IFS అధికారి పర్వీన్‌ కస్వాన్‌ ప్రకారం, నాగ్జిరాలో ఒక పులిని ఏదో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ పులి తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో ఆ పులి రోడ్డుపై పడివుంది. న‌డ‌వ‌లేని ధీన‌ స్థితిలో ఉన్న ఆ పులి కాళ్ల‌ను ఈడ్చుకెంటూ చెట్ల పొద‌ల్లోకి వెళ్లింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర లో జరిగింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా న‌వేగావ్ – నాగ్జీరా కారిడార్ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఘటన చోటు చేసుకుందని తెలిసింది. పాపం పులి రెండు సార్లు లేచి వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. కానీ లేవలేదు. వీడియోలో, ఒక కారు వెనుక లైట్లు వెలుగుతున్నాయి. ఆ వెలుతురులోనే ఆ పులి ఈడ్చుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. గాయ‌ప‌డిన పులిని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంట‌ర్‌కు త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించినట్టుగా అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఎలాగోలా కుంటుకుంటూ పులి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అతను కొంచెం లేచి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు.. అది అక్కడే పడిపోయింది. ఎలాగోలా కిందపడిపోయిన పులి రోడ్డు దాటుకుని అడవిలోకి వెళ్లిపోయింది. అయితే, రోడ్డుపై పులి క‌ద‌ల్లేని స్థితిలో ఉన్న విష‌యాన్ని కొందరు వాహ‌న‌దారులు గ‌మ‌నించారు. ఎక్కడి వారు అక్కడే వాహ‌నాల‌ను ఆపేశారు. పులి రోడ్డుపై ప‌డి ఉన్న దృశ్యాల‌తో పాటు అడ‌విలోకి వెళ్లిన దృశ్యాల‌ను మొత్తం త‌మ ఫోన్ల‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైర‌ల్ చేశారు. పులి దీన‌స్థితిని చూసి జంతు ప్రేమికులు చలించిపోయారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌లో వాహనాలను ఎందుకు అనుమతిస్తారంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..