AP Anganwadi jobs: విశాఖపట్నం జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్‌..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 47 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ..

AP Anganwadi jobs: విశాఖపట్నం జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్‌..
WCD Visakhapatnam
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 27, 2023 | 1:23 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 47 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి స్థానిక గ్రామానికి చెందిన వివాహితులైన మహిళలు మాత్రమే అర్హులు. తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు జులై 1, 2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఏప్రిల్‌ 3, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయం (సీడీపీవో)లో నేరుగాగానీ లేదా పోస్టు ద్వారాగానీ అందజేయవచ్చు. విద్యార్హతలు, వయసు, కులం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.