Andhra Pradesh: గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా యార్లగడ్డ.. 2024 ఎన్నికల్లో మారనున్న పొలిటికల్ ముఖచిత్రం..
ఫ్యాన్ గాలి ఎక్కువగా వీచిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ గన్నవరం సీటును మాత్రం దక్కించుకుంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ చెంత చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ తర్వాత బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణకు బాధ్యతలు అప్పగించినా పార్టీలో మాత్రం లోటు కనపడుతూనే ఉంది. తాజాగా వారం క్రితం వైసీపీని వీడిన యార్లగడ్డ వెంకట్రావు రెండు రోజుల క్రితమే లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. లోకేష్ గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్రలో...
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీట్లలో ఓ స్థానానికి ఎట్టకేలకు సరైన అభ్యర్థి దొరికాడు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పార్టీ ఇంచార్జిగా యార్లగడ్డ వెంకట్రావును అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో గన్నవరం కూడా ఒకటి. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ గెలిచారు. ఫ్యాన్ గాలి ఎక్కువగా వీచిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ గన్నవరం సీటును మాత్రం దక్కించుకుంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ చెంత చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఆ తర్వాత బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణకు బాధ్యతలు అప్పగించినా పార్టీలో మాత్రం లోటు కనపడుతూనే ఉంది. తాజాగా వారం క్రితం వైసీపీని వీడిన యార్లగడ్డ వెంకట్రావు రెండు రోజుల క్రితమే లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. లోకేష్ గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ బహిరంగ సభలో కూడా యార్లగడ్డ టీడీపీ నాయకుడిగా మాత్రమే పాల్గొన్నారు. అయితే యార్లగడ్డతో అప్పటివరకూ వైసీపీలో ఉన్న నేతలు, అనుచరులు కూడా టీడీపీలో చేరారు. అనుచరులు, కార్యకర్తల ముందే యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా ప్రకటించారు లోకేష్.
2024లో గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్ద వెంకట్రావు..
తెలుగుదేశం పార్టీలో చేరకముందు నుంచీ తాను గన్నవరం విడిచేది లేదని చెబుతూనే ఉన్నారు వెంకట్రావు. గన్నవరంలోనే రాజకీయం చేస్తానని.. ఇక్కడే ఉంటానని ప్రకటించారు. వైసీపీలో తనకు సరైన న్యాయం జరగనందున తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించారు. అయితే చంద్రబాబును కలిసిన సమయంలో గన్నవరం అయినా గుడివాడ అయినా.. పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ప్రకటించారు. దీంతో యార్లగడ్డ గన్నవరం వీడుతారా అని చర్చ జరిగింది. లోకేష్ బహిరంగ సభలో కూడా గన్నవరం ఇంచార్జిగా ప్రకటించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి ఎట్టకేలకు ఇంచార్జిగా అధికారిక ప్రకటన చేయడంతో గన్నవరం నుంచే యార్లగడ్డ బరిలో దిగుతారని కన్ఫార్మ్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులను ఇంచార్జిలుగా నియమిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో యార్లగడ్డ కూడా 2024లో టీడీపీ నుంచి గన్నవరంలో బరిలో దిగనున్నారు. ఇప్పటివరకూ ఎంతో మంది నేతలు గన్నవరం సీటు కోసం ప్రయత్నాలు చేసినా.. చివరికి యార్లగడ్డకు అవకాశం రావడంతో టీడీపీ కేడర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది.
వంశీ అటు.. యార్లగడ్డ ఇటు.. జస్ట్ పార్టీ చేంజ్..
తెలుగుదేశం అభ్యర్థి కన్ఫార్మ్ కావడంతో గన్నవరంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మరిపోనున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేసి గెలిస్తే.. ఆయన ప్రత్యర్థిగా వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. కేవలం 280 ఓట్ల తేడాతో వంశీ గెలుపొందారు. ఈసారి వ్యక్తులు వారే అయినా పార్టీలు మాత్రం రివర్స్ అయ్యాయి. అంతేకాదు యార్లగడ్డకు టీడీపీతో పాటు వైసీపీలో వంశీ వ్యతిరేక వర్గం బలం కూడా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరు నేతలు సామాజిక వర్గం ఒక్కటే కావడంతో హోరాహోరీ పోరు తప్పదని కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తనకు కలిసొస్తాయని వంశీ భావిస్తున్నారు. వంశీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనను ఎమ్మెల్యే చేస్తుందని యార్లగడ్డ అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి చూపు గన్నవరంపైనే ఉండే ఛాన్స్ ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..