Sri Rama Navami: శ్రీరామనవవి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ ప్రాంగణంలో చెలరేగిన మంటలు

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లా దువ్వలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

 Sri Rama Navami: శ్రీరామనవవి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ ప్రాంగణంలో చెలరేగిన మంటలు
Fire Accident
Follow us
Basha Shek

|

Updated on: Mar 30, 2023 | 1:19 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లా దువ్వలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలను ముందుగానే గమనించిన భక్తులు అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు. కాగా ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.