TTD Fine: టీటీడీకి ఆర్బీఐ జరిమానా.. రూ.3కోట్లు ఫైన్ కట్టామన్న వైవీ సుబ్బారెడ్డి..
టీటీడీ నిర్లక్ష్యంతో ఆ వడ్డీ కాసులవాడే అపరాధ రుసుం కట్టాల్సి వచ్చింది. రూల్స్ బ్రేక్ చేశారంటూ తిరుమల శ్రీవారికి మూడు కోట్ల రూపాయల ఫైన్ విధించింది కేంద్రం. ఇదిప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారికి జరిమానా ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
టీటీడీ నిర్లక్ష్యంతో ఆ వడ్డీ కాసులవాడే అపరాధ రుసుం కట్టాల్సి వచ్చింది. రూల్స్ బ్రేక్ చేశారంటూ తిరుమల శ్రీవారికి మూడు కోట్ల రూపాయల ఫైన్ విధించింది కేంద్రం. ఇదిప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారికి జరిమానా ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అసలు, ఆ నగదు ఎవరిచ్చారు? మీరెలా తీసుకున్నారంటూ ఆర్బీఐ ప్రశ్నించడంపై ఇదెక్కడి విడ్డూరం అనే మాటలు వినిపిస్తున్నాయ్. అసలింతకీ ఏం జరిగింది?. వడ్డీ కాసులవాడు ఎందుకు ఫైన్ కట్టాల్సి వచ్చింది!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. శ్రీవారి దర్శనం దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలివస్తారు. కోటానుకోట్ల రూపాయలను కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలా వచ్చిన బంగారం, కరెన్సీ విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుందంటే తిరుమల శ్రీవారికున్న క్రేజ్ అలాంటిది.
అయితే, వేంకటేశ్వరస్వామి ఖజానాకి కేవలం ఇండియన్ కరెన్సీయే కాదు, ఫారిన్ కరెన్సీ కూడా కుప్పలుతెప్పలుగా వస్తుంది. అలా, పేరుకుపోతున్న ఫారిన్ కరెన్సీపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ వడ్డీ కాసులవాడే అపరాధ రుసుం చెల్లించాల్సి వచ్చిందిప్పుడు.
టీటీడీ జరిమానా కట్టడం వెనక తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయ్. ఫారిన్ కరెన్సీ కన్వర్షన్ లైసెన్స్ 2018లోనే ముగిసినా రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగినట్టు టీటీడీ ఛైర్మన్ మాటల్లో క్లియర్‌గా తెలుస్తోంది. అంతేనా, తిరుమల శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో వేస్తారు, దానికి టీటీడీని తప్పుబడితే ఎలా అంటున్నారు వైవీ సుబ్బారెడ్డి.
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్‌తో ఈ గుట్టు రట్టయ్యింది. ప్రస్తుతం టీటీడీ దగ్గర 30కోట్ల రూపాయల విలువైన ఫారిన్ కరెన్సీ మూలుగుతోంది. అయితే, నిబంధనలు పాటించడం లేదంటూ 2018లో FCRA లైసెన్స్‌ను రద్దు చేసింది కేంద్రం. ఇప్పుడు ఏకంగా 3కోట్ల ఫైన్ విధించింది. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం తీరును కొందరు తప్పుబడుతున్నారు. టీటీడీ వ్యాపార సంస్థ కాదనే సంగతి గుర్తించాలని అంటున్నారు. అయినా, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి జరిమానా విధించమేంటంటున్నారు భక్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..