Kodali Nani: టీడీపీలో మార్పు రావాలంటే తండ్రితనయులు తప్పుకుని పార్టీ పగ్గాలు తారక్‌కు ఇవ్వమంటున్న కొడాలి నాని

అసలు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లో రావాలని లోకేష్ ఆహ్వానించటం ఏంటి.. తెలుగు దేశం పార్టీని స్థానిపించిందే.. జూనియర్ ఎన్టీఆర్ తాత.. స్వర్గీయ నందమూరితారక రామారావు అంటూ గుర్తు చేశారు నాని. మార్పు రావాల్సింది.. రాష్ట్రంలో కాదు.. ముందుగా టీడీపీలో మార్పు రావాలని సూచించారు.

Kodali Nani: టీడీపీలో మార్పు రావాలంటే తండ్రితనయులు తప్పుకుని పార్టీ పగ్గాలు తారక్‌కు ఇవ్వమంటున్న కొడాలి నాని
Kodali Nani On Tdp
Follow us
Surya Kala

|

Updated on: Feb 25, 2023 | 1:06 PM

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్  రాజకీయాల్లోకి రావాలి అంటూ వ్యాఖ్యానించారు.  అయితే.. నారా లోకేష్ .. తారక్ కు ఇచ్చిన ఆఫర్ పై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ అధ్యక్ష పదివి ఇచ్చి లోకేష్, చంద్రబాబు పార్టీ నుంచి తప్పుకోవాలని సూచించారు. ఆలా జరిగితేనే.. టీడీపీ పార్టీలో మార్పు వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు కొడాలి నాని.

అసలు జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లో రావాలని లోకేష్ ఆహ్వానించటం ఏంటి.. తెలుగు దేశం పార్టీని స్థానిపించిందే.. జూనియర్ ఎన్టీఆర్ తాత.. స్వర్గీయ నందమూరితారక రామారావు అంటూ గుర్తు చేశారు నాని. మార్పు రావాల్సింది.. రాష్ట్రంలో కాదు.. ముందుగా టీడీపీలో మార్పు రావాలని సూచించారు. టీడీపీ నుంచి చంద్రబాబు లోకేష్ తప్పుకొని జూనియర్ ఎన్టీఆర్ కి అధ్యక్ష పదవి ఇస్తే మార్పు వస్తుందన్నారు. అప్పుడు టీడీపీకి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయిన దొరుకుంతుందని జోస్యం చెప్పారు కొడాలి నాని.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..  అది చూసి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని  ఒడించటం తమ వల్లకాదని నారాలోకేష్ గుర్తించాడని.. అందుకనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నీ సపోర్ట్ అడుగుతున్నాడని చెప్పారు కొడాలి నాని.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..