Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం..

Andhra Pradesh Weather Report: ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో.. రేపటికి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అందుకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏపీలో చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం..
Bay Of Bengal
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 17, 2023 | 2:20 PM

వర్షాకాలంలోనూ.. గత వారం పది రోజులుగా.. ఎండ వేడి ఉక్కపొతతో అల్లడిన ఏపీ ప్రజలకు చల్లని కబురు. రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈనెల 18న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడెందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. దీంతో వాతావరణం చల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈశాన్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో.. రేపటికి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అందుకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏపీలో చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

మండుతున్న ఎండలకు కారణమదే..

మాన్సూన్ సీజన్ అయినప్పటికీ.. జూలైలో కురిసిన వర్షాలు ఆగస్టులో లేవు. రుతుపవన ద్రోణ భారతదేశం వైపు ఉంది. మరోవైపు రుతుపవనాలు బలహీనంగా మారాయి. వాస్తవానికి వర్షాకాలంలో మేఘాలు దట్టంగా కమ్ముకోవడం వల్ల ఉష్ణోగ్రతలో తగ్గుతాయి వాతావరణం చల్లబడుతుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో నిర్మలంగా మారింది. దీంతో సూర్యుని కిరణాలు నేరుగా భూమి పైకి పడుతున్నాయి. ఆ కారణంగా ఆగస్టు మొదటి పక్షంలో.. ఉష్ణోగ్రతలు , ఎండ తీవ్రత పెరిగింది. చాలా చోట్ల ఈ సీజన్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఆ రోజుల్లో విస్తారంగా వర్షం..

అయితే.. బంగాళాఖాతంలో ప్రస్తుత పరిస్థితులు అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూలంగా మారాయి. దీంతో రాగల వారం రోజుల్లో.. ఏపీ వ్యాప్తంగా తెలుగు నుంచి మోస్తారు వర్షాలు.. కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈనెల 18, 19 తేదీల్లో భారీ వర్ష సూచన కూడా ఉందని చెబుతున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్.

ఆ జిల్లాకు..

అయితే నెల్లూరు జిల్లాలో.. ఉష్ణోగ్రతలు కొనసాగి క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. గత వారం రోజులుగా ఏపీలో 38 డిగ్రీల వరకు చాలాచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇకనుంచి క్రమంగా ఉష్తంత్ర తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..