Andhra Pradesh: ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులంటే?
ఒకవైపు ఎండలు ముదురుతున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులు పాస్ అయ్యేందుకు..
ఒకవైపు ఎండలు ముదురుతున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులు పాస్ అయ్యేందుకు కష్టపడి రాత్రింబవళ్ళు చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీలో ఒంటిపూట బడులు ఏప్రిల్ 4వ తేదీ నుంచి మొదలు కానున్నాయని విద్యాశాఖ అనధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడులను ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు పదో తరగతి పరీక్షలు నిర్వహించే ఎగ్జామ్ సెంటర్ల(స్కూల్స్)లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారని సమాచారం.
అటు టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు పూర్తయిన వెంటనే వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే 1 నుంచి 9 తరగతులకు ఏప్రిల్ 27 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇక వారికి ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏప్రిల్ 5(బాబు జగజ్జీవన్‌రామ్ జయంతి), ఏప్రిల్ 7(గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 14(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి), ఏప్రిల్ 22(బక్రీద్) ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు సెలవులు.