Andhra Pradesh: అర్చకులకు తీపి కబురు చెప్పిన జగన్ సర్కార్.. వందశాతం మెడికల్ రీఎంబర్స్‌మెంట్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అర్చకులు, వారి కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వందకు వంద శాతం మెడికల్ రీఎంబర్స్ మెంట్ ను ప్రకటించింది.

Andhra Pradesh: అర్చకులకు తీపి కబురు చెప్పిన జగన్ సర్కార్.. వందశాతం మెడికల్ రీఎంబర్స్‌మెంట్..
Andhra Pradesh Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 07, 2023 | 11:04 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అర్చకులు, వారి కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వందకు వంద శాతం మెడికల్ రీఎంబర్స్ మెంట్ ను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని అర్చకులకు ఈ సౌకర్యాన్ని వర్తింప చేసింది. అర్చకులకు అయ్యే వైద్య ఖర్చులన్నిటినీ నూటికి నూరు శాతం.. తామే భరిస్తామని చెప్పింది. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి. ఇదివరకు కూడా ఈ మెడికల్ రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం అమలులో ఉండేది. కానీ అది కేవలం యాభై శాతం మాత్రమే ఉండేది. మిగిలిన ఖర్చు అర్చకులే భరించాల్సి ఉండేది.

అయితే, అర్చకుల ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం అర్చకులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి అయ్యే ఖర్చును నూరుశాతం భరించేలా నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇప్పటికే అర్చకుల కోసం జగన్ సర్కార్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వివాహ రుణాలు, ఉపనయన గ్రాంట్ లు చెల్లిస్తోంది. గృహనిర్మణ రుణం సైతం మంజూరు చేస్తోంది. ఇళ్ల మరమ్మతుల కోసం కూడా నిధుల కేటాయింపు చేస్తోంది. అర్చక కుటుంబాల్లోని పిల్లల చదువు కోసం గ్రాంట్ మంజూరు చేస్తోంది. ఇంజినీరింగ్ మెడిసిన్, లా, సీఏతో వంటి వృత్తివిద్యలకు రుణాన్నిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పదవీ విరమణ చేసిన అర్చకుల కోసం రిటైర్మెంట్‌ గ్రాంటు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అర్చకులు, వారి కుటుంబాల కోసం పూర్తి మెడికల్ రీఎంబర్స్‌మెంట్‌ను ప్రకటించింది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అర్చక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తోన్నాయి. వందశాతం మెడికల్ రీఎంబర్స్‌మెంట్ ప్రకటనను స్వాగతిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..