Tornado Outbreak: అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం.. పలువురు మృతి, మనసుని కలసివేస్తున్న దృశ్యాలు

అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్‌ ధాటికి పలువురు మృతి చెందగా, చాలా మంది గాయపడినట్టు అధికారులు వెల్లడి.

Tornado Outbreak: అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం.. పలువురు మృతి, మనసుని కలసివేస్తున్న దృశ్యాలు
Tornado Outbreak
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2023 | 12:25 PM

అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్‌ ధాటికి పలువురు మృతి చెందగా, చాలా మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

సుడిగాలి 3:30 – 4 గంటల మధ్య సెయింట్ లూయిస్‌కు దక్షిణంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో ఉన్న బోలింగర్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతం గుండా కదిలిందని సార్జంట్ చెప్పారు. ఏ సుడిగాలి సృష్టించిన బీభత్సంలో ఎంతమంది గాయపడ్డారో ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. అంతేకాదు నష్టం చాల ఎక్కువగా ఉందని.. తుఫాన్ తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులు మనసుని కలసి వేస్తుందని పేర్కొన్నారు.

మిస్సిస్సిప్పిలో టోర్నడోల బీభత్సం: 

మిస్సిస్సిప్పిలో టోర్నడోల సృష్టించిన బీభత్సంలో  23 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ బృందం సహ్యకార్యక్రమాలను చేపట్టారు. చెట్లను నరికి వేసి.. రహదారిని క్లియర్ చేస్తున్నారు. విద్యుత్ ను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ మిడ్‌వెస్ట్ , సౌత్‌లోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన తీవ్రమైన ఉరుములు,  వడగళ్ళు , టోర్నడోలు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

ఓ వైపు తుఫాన్, సుడిగాలి భిన్నమైన వాతావరణంతో అగ్ర రాజ్యం అమెరికా వణికిపోతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. చికాగో, ఇండియానాపోలిస్, డెట్రాయిట్ నుండి మెంఫిస్, టేనస్సీ వరకు 40 మిలియన్ల మంది ప్రజలు తుఫాన్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.  మిచిగాన్ దిగువ మధ్య నుండి దిగువ ఒహియో నదీ లోయ మధ్య వరకు తుఫాన్  వచ్చే ప్రమాదం ఉందని తుఫాను శాఖ అధికారులు అంచనా కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..