Pak Economic Crisis: దాయాది దేశంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం.. ఖరీదైనదిగా మారిన ఇఫ్తార్ విందు.. పేదలకు ఖార్జురం అందని ద్రాక్షే..
రోజంతా ఉపవాసం చేసిన అనంతరం.. సాయంత్రం ఈ ఉపవాస దీక్షను విరమించడానికి ఖర్జూరం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇఫ్తార్ లో ఖర్జూరం చాలా ముఖ్యమైనది. ప్రజలు సాయంత్రం ప్రార్థన తర్వాత ఖర్జూరం తిన్న తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు.
రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అల్లాను ఆరాధిస్తూ ఈ రంజాన్ నెల అంతా ఉపవాస దీక్ష చేస్తారు. అయితే ఈ రంజాన్ తమకు చాలా ఖరీదైంది అని వాపోతున్నారు ఆ దేశ ప్రజలు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్. ద్రవ్యోల్బణం ఆ దేశ ప్రజల వెన్ను విరిచేలా చేసింది. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ తినడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పేదల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆ దేశంలోని ద్రవ్యోల్బణం అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.
పాకిస్థాన్‌లో పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అర్థం చేసుకోవడానికి.. ఇఫ్తార్‌లో ఉపయోగించే వస్తువులను ఉదాహరణగా తీసుకుందాం. రోజంతా ఉపవాసం చేసిన అనంతరం.. సాయంత్రం ఈ ఉపవాస దీక్షను విరమించడానికి ఖర్జూరం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇఫ్తార్ లో ఖర్జూరం చాలా ముఖ్యమైనది. ప్రజలు సాయంత్రం ప్రార్థన తర్వాత ఖర్జూరం తిన్న తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. అయితే ఇప్పుడు పాకిస్థాన్‌లో ఈ ఖర్జూరం ధర చూస్తే ఎవరైనా అయ్యో అనాల్సిందే.. ఎందుకంటే ఆ దేశంలో ఇప్పుడు కిలో ఖర్జూరం రూ.1,000కి దొరుకుతుంది. గతేడాది కిలో రూ.350కే లభ్యమైంది. ఖర్జూరంతో పాటు.. రంజావ్ సందర్భంగా మామిడి, అరటిపండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు అరటిపండ్లు డజను రూ.500లకు, ద్రాక్షపండ్లు కిలో రూ.1600లకు లభిస్తున్నాయి. ఈ ధరలను చూసి.. పేదలు ఇఫ్తార్ విందును భరించడం చాలా కష్టము అంటూ వాపోతున్నారు.
ఇఫ్తార్ ప్లేట్ ఖరీదు ఎంతంటే ఇప్పుడు ఇఫ్తారీలో ఉపయోగించే వస్తువుల ధర చుక్కలను తాకుతున్నాయి. ఉదాహరణకు ఒక ప్లేట్ ఫ్రూట్ చాట్ రూ.180కి లభిస్తుంటే. దహీ చాట్ ప్లేట్ రూ.160కి, సమోసా రూ.78కి, ఆలూ చనా చాట్ రూ.160కి లభిస్తున్నాయి. అంతేకాదు 1 లీటర్ బాటిల్ రూహ్ అఫ్జా రూ.280కి లభిస్తుంది. మొత్తంగా 6-7 మంది కలిసి ఇఫ్తార్ చేస్తే ఒకరికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కూలీకి వెళ్తే.. రోజుకు 500 నుంచి 600 వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరోజులో ఒక్కరికే ఇఫ్తారీ కోసం 200 రూపాయలు ఖర్చు చేస్తే.. మరి ఆ కుటుంబ సభ్యులకు 300-400 రూపాయలు మాత్రమే మిగులుతుంది.
అర్బన్ ప్లేట్ ఎంత ఖరీదైనదంటే? ఇప్పుడు పట్టణ ఖర్చుల విషయానికి వస్తే.. రంజాన్‌లో సూర్యోదయానికి ముందు తినే ఆహారాన్ని షహ్రీ అంటారు. ఇందులో పెరుగు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం దీని ధర పాకిస్తాన్‌లో కిలో రూ.150కి చేరుకుంది. అంతేకాదు టీ రూ.50, కోడిగుడ్డు రూ.50కి లభిస్తోంది. దీంతో ఇఫ్తార్ విందుకు పెట్టె ఖర్చు 230-235 ఉంటుంది.. ఇందులోఒక గుడ్డు,ఒక కప్పు టీ , అర కిలో పెరుగు తీసుకుంటాడు. అయితే, ప్రతి ఒక్కరూ పాకిస్తాన్‌లోని నగర ప్రజలకు తినడం లేదు.
మీడియా నివేదికల ప్రకారం, పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 50 ఏళ్ల రికార్డు స్థాయికి చేరుకుంది. పైగా రంజాన్‌లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పేదలు ఆహార ధాన్యాలపైనే ఆధారపడుతున్నారు. పెరుగుతున్న వస్తువుల ధరల ప్రభావం అమ్మకాలపై కూడా పడుతోంది. 2022 సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం ప్రజలు చాలా తక్కువ గా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా దుకాణదారులకు కూడా పెద్ద సమస్య తలెత్తింది. పాకిస్తాన్ పరిస్థితి నిరంతరం క్షీణిస్తోంది. దేశం సహాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి వైపు చూస్తోంది.. అయితే IMF ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..