Long COVID Effect: ఇదో విచిత్రమైన అనుభూతి.. 10 నిమిషాలు నిలబడితే కాళ్లు నీలం రంగులోకి మారుతున్నాయి.. మరో వ్యాధికి సంకేతం..!

వైరస్ సోకినప్పటి నుండి లక్షణాలు కనిపించాయా అని పరిశోధకులు ఆ వ్యక్తిని అడుగగా,.. అంతకు ముందు అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతను కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నప్పటికీ అతని శరీరంలో మరొక వ్యాధి స్థిరపడింది. లాంగ్ కోవిడ్ శరీరంపై బహుళ ప్రభావాలను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి అటానమిక్ నాడీ వ్యవస్థ. ఫలితంగా ..

Long COVID Effect: ఇదో విచిత్రమైన అనుభూతి.. 10 నిమిషాలు నిలబడితే కాళ్లు నీలం రంగులోకి మారుతున్నాయి.. మరో వ్యాధికి సంకేతం..!
Long Covid Effect
Follow us

|

Updated on: Aug 16, 2023 | 9:42 PM

Long COVID Effect: మూడేళ్ల క్రితం చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. ప్రపంచం మొత్తం ఆ ఇన్ఫెక్షన్ (COVID-19)తో పోరాడి నిలిచింది. లాక్‌డౌన్, సామాజిక దూరం, మాస్క్‌లు, శానిటేషన్‌, కరోనా వ్యాక్సినేషన్ వంటి కఠిన నియమ నిబంధనలు యావత్‌ ప్రపంచం పాటించింది. మూడేళ్ల తర్వాత ఇన్‌ఫెక్షన్ ఇప్పుడు చాలా వరకు అదుపులో ఉంది. కానీ కొన్నిసార్లు కొత్త వైవిధ్యాలు కనిపిస్తున్నాయి. కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న చాలా మంది వ్యక్తులు చాలా కాలంగా లక్షణాలను అనుభవిస్తున్నారు. వైద్యులు దీనిని లాంగ్‌ కోవిడ్‌గా పేర్కొన్నారు . ఈసారి దీర్ఘకాల కోవిడ్‌తో బాధపడుతున్న రోగుల పట్ల వైద్యులు-పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురించబడింది. దీర్ఘకాల కోవిడ్ ఉన్న రోగి కేవలం 10 నిమిషాలు నిలబడితే.. ఆ తర్వాత నీలం రంగులోకి మారిపోతున్నట్టుగా గుర్తించారు.

పరిశోధనా నివేదిక మేరకు…33 ఏళ్ల వ్యక్తి శరీరంలో ఈ వింత లక్షణం కనిపించింది. వైద్య పరిభాషలో దీనిని అక్రోసైనోసిస్ అంటారు. కాలి సిరల్లో రక్తప్రసరణ అధికంగా జరగడం వల్ల కాసేపు నిలబడిన తర్వాత పాదాలు నీలం రంగులోకి మారుతాయి. నిటారుగా నిలబడిన 1 నిమిషంలో వ్యక్తి కాళ్ళు ఎర్రగా మారడం, సమయం గడిచేకొద్దీ కాళ్ళు నీలం రంగులోకి మారడం గమనించారు. ఈ మార్పు సమయంలో కాళ్ళ సిరలు స్పష్టంగా కనిపిస్తాయి.

బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీలో నిర్వహించిన ఈ అధ్యయనంలో 10 నిమిషాల పాటు నిలబడిన తర్వాత వ్యక్తి పాదాలు బరువుగా, దురదగా అనిపించినట్లు వెల్లడించింది. కానీ కూర్చున్న తర్వాత పాదాల రంగు, పరిస్థితి రెండు నిమిషాల్లో పూర్తిగా సాధారణంగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

వైరస్ సోకినప్పటి నుండి లక్షణాలు కనిపించాయా అని పరిశోధకులు ఆ వ్యక్తిని అడుగగా,.. అంతకు ముందు అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతను కరోనా ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నప్పటికీ అతని శరీరంలో మరొక వ్యాధి స్థిరపడింది. ఇది Postural orthostatic tachycardia syndrome ఇది ఒక శారీరక స్థితి. దీనిలో నిలబడి ఉన్నప్పుడు హృదయ స్పందన అసాధారణ రేటుతో పెరుగుతుంది.

లాంగ్ కోవిడ్ శరీరంపై బహుళ ప్రభావాలను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి అటానమిక్ నాడీ వ్యవస్థ. ఫలితంగా హృదయ స్పందన రేటు పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది, శ్వాస సమస్యలు, జీర్ణ సమస్యలు, లైంగిక భావాలు కూడా ప్రభావితమవుతాయి. పిల్లలు కూడా ఈ లక్షణాలు అనుభవించాల్సి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…