Canada–United States border: పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి వలసజీవులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.. తాజాగా.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా దారుణం చోటుచేసుకుంది. పడవలో సరిహద్దులు దాటుతూ ఎనిమిది మంది ప్రాణాలు కొల్పోయారు. కెనడా నుంచి అమెరికా బార్డర్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు ఉండగా.. ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. చనిపోయినవారు రొమానియా, భారతదేశానికి చెందిన రెండు కుటుంబాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు -క్యూబెక్ పరిధిలోని సెయింట్ లారెన్స్ నదిలో ఈ ఘటన జరిగిందని.. మృతదేహాలను గురువారం ఆలస్యంగా గుర్తించినట్లు స్థానిక డిప్యూటీ పోలీసు చీఫ్ లీ-ఆన్ ఓ’బ్రియన్ ఒక వార్తా సంస్థకు తెలిపారు. వీరంతా కెనడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా.. పడవలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిందన్నారు.
వీరంతా బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరగ్గా గురువారం వెలుగులోకి వచ్చింది. సరిహద్దుల్లో లారెన్స్ నదిలోని చిత్తడి ప్రాంతంలో వైమానిక తనిఖీలు నిర్వహిస్తుండగా.. మొదట ఓ మృతదేహం కనుగొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి మరికొన్ని మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..