ఇండియన్‌ స్టూడెంట్స్‌కి షాకింగ్ న్యూస్‌.. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టిన వాళ్లకి

వీసా ప్రాసెస్ అంతా పూర్తయ్యింది. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‌ ఖరారైంది. ఇతర పత్రాలూ ఉన్నాయ్‌.. ఐనా.. USలో ల్యాండ్‌ అయ్యాక ఇలాంటి పరిస్థితి రావడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. సరైన కారణం చెప్పకుండానే డిపోర్ట్‌ చేశారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోర్ట్ అయిన విద్యార్థులు చెప్తున్న సమాచారం ప్రకారం.. వాళ్లందరినీ ఇమిగ్రేషన్‌ చెకింగ్స్‌ తర్వాత ఇరుకు గదుల్లో పెట్టి ఎవరితో మాట్లాడకుండా నిర్బంధించేశారు. వాదిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారంటున్నారు విద్యార్థులు...

ఇండియన్‌ స్టూడెంట్స్‌కి షాకింగ్ న్యూస్‌.. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టిన వాళ్లకి
USA Immigration
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2023 | 2:59 PM

అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఇది షాకింగ్‌ వార్త.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన విద్యార్థులకు ఇది ఊహించని షాక్‌ అనే చెప్పాలి. ఎన్నో ఆశలతో అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినా తీరా ఇమిగ్రేషన్ చెక్‌లో కొందరిని డిపోర్ట్‌ చేస్తున్నారు. సరైన పత్రాలు లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు. ఒక్కరోజులోనే 21 మంది విద్యార్థుల్ని వెనక్కి పంపించేశారు. వాళ్లు ఏ ఎయిర్‌పోర్ట్‌లో దిగారో అక్కడి నుంచే తిరిగి ఢిల్లీకి రిటర్న్‌ అవ్వాల్సి వచ్చింది.

వీసా ప్రాసెస్ అంతా పూర్తయ్యింది. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్‌ ఖరారైంది. ఇతర పత్రాలూ ఉన్నాయ్‌.. ఐనా.. USలో ల్యాండ్‌ అయ్యాక ఇలాంటి పరిస్థితి రావడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. సరైన కారణం చెప్పకుండానే డిపోర్ట్‌ చేశారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోర్ట్ అయిన విద్యార్థులు చెప్తున్న సమాచారం ప్రకారం.. వాళ్లందరినీ ఇమిగ్రేషన్‌ చెకింగ్స్‌ తర్వాత ఇరుకు గదుల్లో పెట్టి ఎవరితో మాట్లాడకుండా నిర్బంధించేశారు. వాదిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారంటున్నారు విద్యార్థులు. దాదాపు 16 గంటలపాటు పేరెంట్స్‌తో సైతం మాట్లాడనివ్వలేదంటూ వారు తీవ్రమైన ఆవేదనతో చెప్తున్నారు. అలాగే విద్యార్థుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేశారు.

అమెరికా వెళ్లడానికి వీసా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకసారి డిపోర్ట్ చేస్తే 5 ఏళ్లపాటు USలో అడుగుపెట్టే అవకాశం కోల్పోతారు. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు వదులుకుని లక్షల్లో అప్పులు చేసి అమెరికా వెళ్లారు. తీరా అక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి రావాల్సి రావడం వారికి మింగుడు పడడం లేదు. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో సహా.. మరికొన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ ల్యాండ్ అయిన కొందరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఇమిగ్రేషన్‌ చెక్ తర్వాత ఎయిర్‌పోర్ట్స్‌ నుంచే రిటర్న్‌ ఫ్లైట్‌లో వాళ్లను ఢిల్లీకి పంపించేశారు.

ఇవి కూడా చదవండి

గుర్తింపు పొందిన వర్సిటీలో అడ్మిషన్‌ పొందినా కష్టాలు రావడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెయింట్‌ లూయిస్‌, డకోటా ప్రముఖ వర్సిటీల్లో అడ్మిషన్లు పొందినా.. ఇప్పుడు వివిధ కారణాలతో కొందరు విద్యార్థుల్ని డిపోర్ట్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. ఈ సందర్భంగా వీసా ప్రిపరేషన్‌కి సంబంధించి కన్సల్టెంట్‌లతో విద్యార్థులు చేసిన వాట్సప్‌ చాట్‌ను పరిశీలించారు. సోషల్‌ మీడియా ఖాతాలు పరిశీలించడం.. చాటింగ్‌ వంటివి చెక్‌ చేయడం లాంటివి కూడా పూర్తయ్యాక.. కొందర్ని వెనక్కు పంపేశారు. నిబంధనల విషయంలో ఎంత కఠినంగా ఉన్నా.. కనీసం తమకు కారణం కూడా చెప్పకపోవడం పట్ల తిరిగి వచ్చేసిన విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. గతంలో ఫేక్‌ యూనివర్సిటీల్లో అడ్మిషన్లతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అవన్నీ చూశాం. ఇక ఇప్పుడు ప్రముఖ వర్సిటీల్లో సీటు వచ్చినా.. ల్యాండ్ అయిన తర్వాత వెనక్కి పంపేస్తుండడమే ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..