USA: భారతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ఇమ్మిగ్రేషన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే
పైచదువుల కోసం అమెరికా వెళ్లిన కొందరిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్ట్ నుంచే తిప్పిపంపించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, బలవంతంగా ఇండియాకు పంపిచేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలుస్తోంది. వారం రోజుల నుంచి ఈ తంతు నడుస్తోన్నా తాజాగా ఒక్కరోజే ఏకంగా 20 మందిని పంపించడం కలవరం రేపింది...
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనేది సగటు భారతీయ విద్యార్థి కల, ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎలాగైనా అమెరికాలో ఎమ్‌ఎస్ పూర్తి చేయాలి, అక్కడే హెచ్1బీపై ఉద్యోగాన్ని సంపాదించాలనే కసితో ఉంటారు. దీంతో ప్రతీ ఏటా అమెరికాకు వేలాది మంది విద్యార్థులు రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే అంతే బాగా జరిగితే మంచిదే కానీ, ఏమాత్రం తేడా కొట్టినా ఇదిగో ఇప్పుడు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులే పడాల్సి వస్తుంది.
పైచదువుల కోసం అమెరికా వెళ్లిన కొందరిని అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్ట్ నుంచే తిప్పిపంపించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అసలు ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, బలవంతంగా ఇండియాకు పంపిచేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలుస్తోంది. వారం రోజుల నుంచి ఈ తంతు నడుస్తోన్నా తాజాగా ఒక్కరోజే ఏకంగా 20 మందిని పంపించడం కలవరం రేపింది. అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలువుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు భారీగా అమెరికా వెళ్తున్నారు.
దీంతో అమెరికాలోని ఎయిర్‌పోర్టుల్లో భారతీయ విద్యార్థుల రద్దీ కొనసాగుతోంది. వారం రోజులుగా ఇండియన్ స్టూడెంట్స్ పోటెత్తుతున్నారు. సెప్టెంబర్ 10వరకు అమెరికా యూనివర్సిటీల్లో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్ జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు పయనమవుతున్నారు. ఆగస్టు 25 తర్వాత ఈ రద్దీ ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే డిపోర్ట్ ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓవైపు అమెరికా విమానాశ్రయాల్లో భారతీయ విద్యార్ధుల డీపోర్ట్ కొనసాగుతుంటే… ఇంకోవైపు ఇండియన్ స్టూడెంట్స్ రద్దీతో కిటకిటలాడుతున్నాయ్ యూఎస్ ఎయిర్‌పోర్ట్స్. ఇప్పటికే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్‌ని వెనక్కి పంపేసింది అమెరికా ఇమ్మిగ్రేషన్. అంతేకాదు, మరింత స్ట్రిక్ట్‌గా వ్యవహరించబోతోంది. అయితే, డీపోర్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.
అమెరికా వెళ్లే భారతీయులకు నిపుణుల సూచనలు..
* వీసా కోసం ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారో వాటినే ఇమ్మిగ్రేషన్‌లో చూపించాలి
* అమెరికా వెళ్లే నాటికి డాక్యుమెంట్స్ అన్నీ అప్‌డేట్‌గా ఉండాల్సిందే.
* ఇమ్మిగ్రేషన్‌లో కాన్ఫిడెంట్‌గా ఉండాలి.
* ఇమ్మిగ్రేషన్‌లో ఏ ప్రశ్నలు అడుగుతారో ముందే ప్రిపేర్ కావాలి
* ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పగలిగేలా ఉండాలి
* తడబడకుండా సమాధానాలు చెప్పడం చాలా ముఖ్యం.
* ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి
* అమెరికాలో ఉన్నవారిని ఎలాంటి సహాయం అడగకూడదు
* ఏ వర్సిటీలో చేరుతున్నారో దానికి దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లోనే దిగాలి
* చదువుకుంటూ ఉద్యోగం చేస్తాననే మాటలు చెప్పకూడదు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..