మాస్కో పర్యటన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. రష్యాతో వ్యూహాత్మక సంబంధాలకే ప్రాధాన్యం అంటూ ప్రకటన..
Russia-China: మాస్కో పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్‌తో సమావేశమయ్యారు. రష్యాతో వ్యూహాత్మక సంబంధాలకు తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని జిన్‌పింగ్ ప్రకటించారు.
మాస్కో పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్‌తో సమావేశమయ్యారు. రష్యాతో వ్యూహాత్మక సంబంధాలకు తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని జిన్‌పింగ్ ప్రకటించారు. మరోవైపు పుతిన్‌ను ఈ ఏడాది చివర్లో చైనాలో పర్యటించాల్సిందిగా జిన్‌పింగ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో చైనా శాంతి ప్రతిపాదనపై రష్యా అధినేత పుతిన్, జిన్‌పింగ్‌లు సుదీర్ఘ చర్చ చేపట్టినట్లు సమాచారం అందుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. చైనా అధినేత జిన్‌పింగ్ రష్యాలో పర్యటిస్తున్న సమయంలో కిషిదా కీవ్‌లో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పర్యటనలో ఉన్న కిషిదా ఇక్కడి నుంచి నేరుగా ఉక్రెయిన్ చేరుకున్నారు.
రష్యా సైనిక చర్య కొనసాగుతోన్న తరుణంలో కిషిదా ఉక్రెయిన్ పర్యటన.. ఆ దేశానికి సంఘీభావంతోపాటు ఇరుదేశాల మధ్య బలమైన సహకారానికి సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో కిషిదా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను జపాన్ ఖండిస్తోంది.
మరన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..