Guinness World Record: పాప్‌ కార్న్‌ తిన్నంత ఈజీగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టేశాడు.. ఈయనది మామూలు స్పీడ్‌ కాదు.. అసలు విషయం తెలుసుకోండి..

ఇడాహోకు చెందిన ఓ వ్యక్తి స్టవ్‌పై పాప్‌ కార్న్‌ వేయిస్తున్న సమయంలో పైకి ఎగురుతున్న పాప్‌ కార్న్‌ ని చేతులతో పట్టుకొని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

Guinness World Record: పాప్‌ కార్న్‌ తిన్నంత ఈజీగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టేశాడు.. ఈయనది మామూలు స్పీడ్‌ కాదు.. అసలు విషయం తెలుసుకోండి..
Popcorn
Follow us
Madhu

|

Updated on: Mar 23, 2023 | 11:30 AM

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అంటే మాటలు కాదు. చాలా మంది దానిని ఓ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌గా కూడా భావిస్తారు. వారికున్న కళలు, నైపుణ్యాలు, ధైర్య సాహసాలను ప్రదర్శించి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తమ పేరును లిఖించుకోవాలని తాపత్రయపడతారు. దానిని సాధించడం కూడా అంత సులువు కాదు. అయితే ఇడాహోకు చెందిన ఓ వ్యక్తి స్టవ్‌పై పాప్‌ కార్న్‌ వేయిస్తున్న సమయంలో పైకి ఎగురుతున్న పాప్‌ కార్న్‌ ని చేతులతో పట్టుకొని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

స్టెమ్‌ విద్యను ప్రోత్సహించడానికి 250 కంటే ఎక్కువ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను బద్దలు కొట్టిన డేవిడ్ రష్  మరో రికార్డు సాధించారు. తన స్టవ్‌పై ఓ ప్యాన్‌ను తీసుకొని పాప్‌కార్న్‌ను వేయిస్తూ.. ఆ సమయంలో పైకి గాలిలోకి ఎగురుతున్న పాప్‌ కార్న్‌ని తన చేతితో పట్టుకునేందుకు ప్రయత్నించారు. అలా పట్టుకున్న పాప్‌ కార్న్‌ ముక్కలను నాలుగు సంవత్సరాల వయసున్న తన కొడుకు పట్టుకున్న మరో ప్యాన్‌లో వేశాడు. ఇలా కేవలం నిమిషం సమయంలో 36 పాపింగ్‌ ముక్కలను చేతులతో పట్టుకున్నారు. ఇదిగో ఆ వీడియో మీరూ చూసేయండి..

ఇది కొత్త రికార్డు..

డేవిడ్‌ రష్‌ ఒక నిమిషం సమయంలో 36 పాప్‌ కార్న్‌ ముక్కలను పట్టుకోవడం ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికర్డు సాధించారు. అంతకుముందు ఈ రికార్డు బ్రేకర్‌ అశ్రిత ఫర్మాన్‌ పేరిట ఉంది. 2011 ఇదే ఫీట్‌ ను ఫర్మాన్‌ సాధించాడు. కానీ ఒక నిమిషంలో కేవలం 34 పాప్‌కార్న్‌ ముక్కలను ఫర్మాన్‌ పట్టుకోగలిగారు. ఇప్పుడు డేవిడ్‌ రష్‌ ఆ రికార్డును అధిగమించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. ఈ ప్రయత్నంలో తనకు సహకరించిన తన కొడుకుకు ఈ ఘనతను రష్‌ అంకితమిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కక క్లిక్ చేయండి..