తాలిబాన్ క్రూరత్వం భరించలేని ఆఫ్ఘనీస్‌.. టర్కీ వైపు పరుగులు..! పసి పిల్లలతో హృదయవిదారకంగా..

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ అత్యంత పేదరికంలోకి వెళ్లిందని నివేదికలు వచ్చాయి. తీవ్రమైన ఆర్థిక మాంద్యంతోపాటు తరచూ తీవ్రవాద దాడులతో దేశం అతలాకుతలమవుతోంది.

తాలిబాన్ క్రూరత్వం భరించలేని ఆఫ్ఘనీస్‌.. టర్కీ వైపు పరుగులు..! పసి పిల్లలతో హృదయవిదారకంగా..
Afghan
Follow us

|

Updated on: Feb 10, 2023 | 8:09 PM

తాలిబన్ల పాలనలో విసిగి వేసారిన ఆఫ్ఘన్ ప్రజలు టర్కీకి పారిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.. భూకంపం ధాటికి అతలాకుతలమైనా టర్కీకి పారిపోవాలనే కోరికతో జనం భారీగా వస్తున్నారు. తాలిబన్ల క్రూరత్వం, ఆకలి చావుల నుండి తప్పించుకోవటానికి అఫ్ఘాన్ ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో చూపించే వీడియో ఇది. పసిపాపలతో ఉన్న మహిళలతో సహా వందలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

భూకంప సహాయం కోసం టర్కీకి విమానాలు తిరుగుతున్నాయని పుకార్లు వ్యాపించడంతో మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా జనం పరుగులు తీశారు. ప్రజలు తమ బ్యాగులు, వస్తువులు లేకుండానే విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. విమానాశ్రయంలో తాలిబన్ భద్రతా బలగాలు వారిని అడ్డుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

భూకంపం కారణంగా అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు తాలిబన్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. వెంటనే సహాయక సిబ్బందిని టర్కీకి తరలించినట్లు తప్పుడు ప్రచారం జరిగింది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత, వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయారు. ఓ మహిళ తన కన్న బిడ్డను అమెరికా సైనికులకు ఇస్తున్న చిత్రం అప్పట్లో విస్తృతంగా వైరల్‌ అయ్యింది.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ అత్యంత పేదరికంలోకి వెళ్లిందని నివేదికలు వచ్చాయి. తీవ్రమైన ఆర్థిక మాంద్యంతోపాటు తరచూ తీవ్రవాద దాడులతో దేశం అతలాకుతలమవుతోంది. ఇంతలో, తాలిబన్లు విశ్వవిద్యాలయ విద్యపై బాలికలకు నిషేధించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం …