Aliens Signal: అంగారక గ్రహం నుంచి వచ్చిన సిగ్నల్స్.. గ్రహంతరవాసులే పంపారా ?

ఈ విశ్వంలో కేవలం భూమిపైనే జీవం ఉందా లేదా భూమిలాంటి గ్రహాలు ఇంకా ఎక్కడైన ఉన్నాయా అనే దానిపై నిరంతంరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహంతరవాసులు నిజంగానే ఉన్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు.

Aliens Signal: అంగారక గ్రహం నుంచి వచ్చిన సిగ్నల్స్.. గ్రహంతరవాసులే పంపారా ?
Mars
Follow us
Aravind B

|

Updated on: May 26, 2023 | 4:21 PM

ఈ విశ్వంలో కేవలం భూమిపైనే జీవం ఉందా లేదా భూమిలాంటి గ్రహాలు ఇంకా ఎక్కడైన ఉన్నాయా అనే దానిపై నిరంతంరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహంతరవాసులు నిజంగానే ఉన్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు. అయితే గ్రహంతరవాసుల గురించి సరైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఈ విశ్వంలో ఏదో ఒక గ్రహంపై జీవం ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ భూమికి పంపింది.

అంగారక గ్రహంపై అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ గతంలో టీజీవోను ప్రయోగించింది. అయితే ఈ సందేశాన్ని గ్రహంతర వాసులే పంపారా అనేదానిపై స్పష్టత లేదు. అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీవో 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్‌ స్టేషన్‌కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైనట్లు తేలితే.. ఇది చరిత్రలో నిలిచిపోతుందని ‘ఎ సైన్స్‌ ఇన్‌ స్పేస్‌’ ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్‌ తెలిపారు.

ఎన్‌కోడ్‌ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు ఇది కఠిన సమస్యగా మారింది. దాన్ని డీకోడ్‌ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి అవకాశం కూడా కల్పించారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా అనే విషయంలోను పరిశీలిస్తున్నారు. అయితే అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసి వచ్చిన సిగ్నల్స్‌ను https://asignin.space/the-message/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి గలవారు ఎవరైన ఆ సమాచారాన్ని డీకోడ్ చేసి.. దాని అర్థాన్ని వారికి పంపించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..