Fake Currency: ఫేక్ కరెన్సీని గుర్తించడం ఎలా? లైవ్ డెమో చూడండి..
హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నది కేవలం రూ.30 లక్షల దొంగనోట్లు మాత్రమే.. అయితే కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లు హైదరాబాద్‌లో చలామణిలో ఉండొచ్చని తెలుస్తోంది. మరి నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి.
మీ జేబులో ఉన్న ఐదొందల నోటు అసలైనదేనా..? మీ పర్సులో ఉన్న కరెన్సీ ఒరిజినలేనా?. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. మీ దగ్గరున్న నోట్లలో డూప్లికేట్ ఉండొచ్చు. ఫేక్ కరెన్సీ ఉండొచ్చు. అవును ఇది నిజం!. మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి, మీ జేబులోకి, మీ పర్సులోకి దొంగనోట్లు చేరిపోతున్నాయ్! మొన్నటివరకు డ్రగ్స్, పేకాట, క్యాసినో, బెట్టింగ్… ఇప్పుడు ఫేక్ కరెన్సీ భాగ్యనగరంలో కల్లోలం రేపుతోంది. లక్షల్లో కాదు కోట్లల్లో నకిలీ కరెన్సీని హైదరాబాద్‌లో డంప్ చేసింది ముఠా. పైగా ఇది లోకల్ గ్యాంగ్ కాదు, ఇంటర్ స్టేట్ ముఠా. నాలుగైదు రాష్ట్రాల కేటుగాళ్లంతా కలిసి కొట్లకొద్దీ ఫేక్ కరెన్సీని హైదరాబాద్ మార్కెట్లోకి వదలడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నది కేవలం రూ.30 లక్షల దొంగనోట్లు మాత్రమే.. అయితే కోట్లాది రూపాయల కరెన్సీ నోట్లు హైదరాబాద్‌లో చలామణిలో ఉండొచ్చని తెలుస్తోంది. మరి నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలాగో టీవీ9 టాస్క్ ఫోర్స్ అందిస్తున్న లైవ్ డెమో ద్వారా తెలుసుకోండి.