At Home Ceremony: రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం.. తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు..

At Home Ceremony: రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం.. తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు..

Janardhan Veluru

|

Updated on: Aug 15, 2023 | 8:49 PM

Independence Day 2023: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. తెలంగాణ కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 

హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అయితే రాజ్ భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. తెలంగాణ కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

రాజ్ భవన్ లో తమిళిసై మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. బిల్లులపై స్పందించేందుకు ఇది సరైన సమయం కాదన్నారు గవర్నర్. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Published on: Aug 15, 2023 08:39 PM