Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ

మొన్నటివరకు ఏకంగా రెండు వందలుపైన పలికిన టమాటాలు ఇప్పుడు రికార్డుస్థాయిలో తగ్గాయి. మదనపల్లె మార్కెట్లో ఊహించని విధంగా టమాటా ధరలు పతనమయ్యాయి.. మూడు రోజులుగా మార్కెట్లు టమాటా దిగుబడి పెరగుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి. బుధవారం కిలో 100 వరకు పలికిన టమాటాలు గురువారం మరింత తగ్గాయి. ఏ గ్రేడ్ టమాటాలు కిలో 50 నుంచి 64 మధ్య పలికాయి. మదనపల్లెలో బి గ్రేడ్ టమాటా ఏకంగా 36కు పడిపోయింది..అయితే టమోటా ధరల పతనంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ

|

Updated on: Aug 11, 2023 | 9:55 PM

మొన్నటివరకు ఏకంగా రెండు వందలుపైన పలికిన టమాటాలు ఇప్పుడు రికార్డుస్థాయిలో తగ్గాయి. మదనపల్లె మార్కెట్లో ఊహించని విధంగా టమాటా ధరలు పతనమయ్యాయి.. మూడు రోజులుగా మార్కెట్లు టమాటా దిగుబడి పెరగుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి. బుధవారం కిలో 100 వరకు పలికిన టమాటాలు గురువారం మరింత తగ్గాయి. ఏ గ్రేడ్ టమాటాలు కిలో 50 నుంచి 64 మధ్య పలికాయి. మదనపల్లెలో బి గ్రేడ్ టమాటా ఏకంగా 36కు పడిపోయింది..అయితే టమోటా ధరల పతనంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. గత నెల 29, 30న కిలో టమోటా ధర మదనపల్లి మార్కెట్ లో డబుల్ సెంచరీ కి చేరువైన టమోటా ఇప్పుడు కనిష్ఠ ధర 36 రూపాయలకు రావడంతో రైతాంగం దిగాలు చెందుతోంది. ఉన్నపళంగా ధరలు పడిపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ లో మూడు రోజుల్లోనే టమోటా ధరల్లో ఇంత భారీ తేడాకు అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మదనపల్లి మార్కెట్ కు టమోటా దిగుబడి పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు బయర్ల నుంచి పోటీ లేకపోవడం ప్రధాన కారణం అంటున్నారు. పక్క జిల్లాల్లో కూడా టమోటా దిగుబడి ప్రారంభం కావడంతోనే ధరల పతనానికి కారణమంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ద్వారాకా తిరుమల ఆలయం వద్ద అమానుషం !! దైవ సన్నిధిలోనే ??

జాగ్రత్త !! మీరు తాగేదీ పాలు కాదు.. కాలకూట విషం

TOP 9 ET News: ‘భోళా శంకర్’ నిలిపివేత | ఆల్ టైం రికార్డ్‌.. బాక్స్‌ బద్దలుకొట్టిన బాబు

Digital TOP 9 NEWS: రాస్తారోకో చేసిన కోతులు | దిగి వస్తున్న టమోటా ధరలు

Follow us
Latest News