Watch Video: ఒంటరి సింహంపై హైనాల దాడి.. అంతలోనే వర్గపోరుగా మలుపు.. ఆపై ఏం జరిగిందో మీరే చూడండి..

సింహాలకు పరమ శత్రువులైన హైనాల గురించి చెప్పాలంటే వాటి కడుపు గుడ్డి బావి.. అంటే ఎంత తిన్నా కడుపు నిండదని అర్థం. ఇక ఈ హైనాలు మందలుమందలుగా నివసిస్తుండటం, అవకాశం దొరికిన వెంటనే సింహాలపై దాడి చేయడం మీరు తప్పక చూసే ఉంటారు. తాజాగా..

Watch Video: ఒంటరి సింహంపై హైనాల దాడి.. అంతలోనే వర్గపోరుగా మలుపు.. ఆపై ఏం జరిగిందో మీరే చూడండి..
Gang War Between Wild Animals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 25, 2023 | 2:42 PM

సింహాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువుగా పరిగణించబడుతున్నప్పటికీ.. అవే కాకుండా భూమిపై ప్రమాదకరమైన, ఇంకా ప్రాణాంతకంగా పేర్కొనదగిన అనేక జంతువులు ఉన్నాయి. వీటిలో పులి, చిరుతపులి, చిరుత,  హైనా వంటివి ఉన్నాయి. ముఖ్యంగా సింహాలకు పరమ శత్రువులైన హైనాల గురించి చెప్పాలంటే వాటి కడుపు గుడ్డి బావి.. అంటే ఎంత తిన్నా కడుపు నిండదని అర్థం. ఇక ఈ హైనాలు మందలుమందలుగా నివసిస్తుండటం, అవకాశం దొరికిన వెంటనే సింహాలపై దాడి చేయడం మీరు తప్పక చూసే ఉంటారు. తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హైనాల మంద ఒంటరిగా ఉన్న ఆడ సింహంపై దాడి చేస్తుంది. అయితే ఆ తర్వాత వెంటనే మరి కొన్ని ఆడ సింహాలు అక్కడికి రావడంతో ఆ హైనాల మంద తొక ముడిచి తుర్రుమన్నాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను అలరిస్తుంది.

ట్విట్టర్ వేదికగా షేర్ అయిన ఈ వీడియోలో హైనాల మంద ఆడసింహాన్ని ఎలా వెంబడిస్తున్నాయో.. దాన్ని తమ ఆహారంగా మార్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో వీడియోలో చూడవచ్చు. అయితే ఆ సమయంలో.. ఆ ఆడ సింహం వాటి నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ హైనాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వాటిదే పైచేయి అయింది. కానీ అంతలోనే మరో 5 లేదా 6 ఆడసింహాలు అక్కడికి చేరుకుని వాటిని తరిమికొట్టాయి. ఇక చివరి క్షణంలో కూడా తమ సహచరి అయిన ఆడ సింహాన్ని కాపాడేందుకు మిగిలిన సింహాలు అక్కడకి చేరుకోవడం చాలా ముచ్చట గొల్పేలా ఉంటుంది. దీంతో ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేయడమేకాక వారి ఆదరణను పొందుతోంది. ఈ వీడియోను మీరు ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

క్రూరమైన జంతువులతో ఇటువంటి గ్యాంగ్ వార్ చాలా అరుదుగా జరుగుతుంది. ఇంకా ఎంతో అరుదుగా మన కంట పడుతుంది. కేవలం 13 సెకన్లే ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 50 వేల వీక్షణలు, అలాగే 500 లైకులు వచ్చాయి. అదే క్రమంలో పలువురు నెటిజన్లు వీడియోను చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక వారిలో ఒక నెటిజన్ ‘ఎవరైనా సరే ఎప్పుడూ కూడా ఒంటరిగా తిరగకూడదు, లేకుంటే ఇలాంటి పరిస్థితి ఎదురుపడవచ్చు. నేను నా కొడుకుకు కూడా ఇదే సలహా ఇచ్చాను’ అంటూ రాసుకొచ్చారు.అలాగే మరో నెటిజన్ ‘ఇది ప్రపంచ యుద్ధం 3 లాగా ఉంది’ అని అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో పలువురు తమ తమ అభిప్రాయాలను, స్పందనలను కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..