Watch Video: నీటిలో ఉన్న మొసళ్లకు చేతితో తినిపించేశారు భయ్యా..వైరలవుతున్న వీడియో

మొసళ్లను చూస్తేనే కొందరు భయంతో హడలెత్తిపోతారు. కొంచెం దగ్గరికి వెళ్లి చూసేందుకు కూడా ఇష్టపడరు. ఒకవేళ అవి ఎవరిపైనైనా దాడి చేస్తే వారు మాములుగా గాయాలవ్వవు. కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది.

Watch Video: నీటిలో ఉన్న మొసళ్లకు చేతితో తినిపించేశారు భయ్యా..వైరలవుతున్న వీడియో
Couple
Follow us
Aravind B

|

Updated on: Mar 26, 2023 | 8:22 AM

మొసళ్లను చూస్తేనే కొందరు భయంతో హడలెత్తిపోతారు. కొంచెం దగ్గరికి వెళ్లి చూసేందుకు కూడా ఇష్టపడరు. ఒకవేళ అవి ఎవరిపైనైనా దాడి చేస్తే వారు మాములుగా గాయాలవ్వవు. కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఓ జంట మాత్రం మోసళ్లతో నీటిలో సరదాగా గడిపారు. అంతేకాదండోయ్ వాటిని దగ్గరికి పిలిచి ఆహార పదార్థాలు కూడా నోట్లో పెట్టారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాకి చెందిన ఓ జంట సరదగా గడిపేందుకు ఓ చిన్న నదిలోకి వెళ్లారు. అయితే అందులో మొసళ్లు కూడా ఉన్నాయి. వాటిని చూడగానే ఆ జంట భయంతో పారిపోలేదు. అక్కడే కూర్చోని సాండ్విజ్ ను చూపిస్తూ ఆ మొసళ్లను పిలిచారు. అందులో ఓ మొసలి వారి దగ్గరకు వచ్చింది.

మహిళ తన చేతిలో సాండ్వీజ్ ను పట్టుకోని ఉండగా.. తన భర్త అందులో ముక్కలను తీసుకోని ఆ మొసలి నోట్లో పెట్టాడు. ఆ తర్వాత మొసలి వెనక్కి వెళ్లిపోయింది. మళ్లీ ఆ సాండ్విజ్ ను చూపిస్తూ మొసళ్లను పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియో పై భిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..