Viral Video: బిడ్డ తొలి అడుగులు చూసి మురిసిపోయిన తల్లి ఏనుగు.. మనసు పులకరించే వీడియో
జంతువుల్లో అమ్మ ప్రేమకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.మనుషులకంటే జంతువుల్లోనే తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాజాగా అమ్మ ప్రేమకు అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రాంతం ఏదైనా, బాషా ఏదైనా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ అమ్మ ప్రేమ ఒకేలా ఉంటుంది. జంతువుల్లో అమ్మ ప్రేమకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.మనుషులకంటే జంతువుల్లోనే తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాజాగా అమ్మ ప్రేమకు అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మనసు పులకరించక మానదు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో ఒక ఏనుగుకు సంబంధించింది. ఏనుగులు మనలాగే ఆలోచనలు, లోతైన భావాలు, భావోద్వేగాలను కలిగి ఉంటాయి.
ఇక పిల్ల ఏనుగులు చేసే కొన్ని తమాషా చిలిపి చేష్టలు హృద్యంగా ఉంటాయి. ఏనుగు పిల్ల చేష్టలకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి.
పిల్లలు పుట్టిన తర్వాత చిన్న చిన్న అడుగులు వేస్తువుంటారు. బిడ్డ మొదటి అడుగులు తల్లిదండ్రులకు ఎంతో ప్రదానం. కొంతమంది వాటిని వీడియోల రూపంలో భద్రంగా దాచుకుంటారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ పిల్ల ఏనుగు. తొలిసారి అడుగులు వేసింది. అది చూస్తూ తల్లి ఏనుగు మురిసిపోయింది. బిడ్డ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో పాటు పిల్ల ఏనుగు నడక నేర్చుకుంటుందన్న ఆనందం ఆ తల్లి ఏనుగుతో కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.