Viral: ఇల్లు రిపేర్ చేయిస్తుండగా దొరికిన 100 ఏళ్ల నాటి డైరీ మిల్క్.. ఓపెన్ చేసి చూడగా..

లండన్‌లో ఓ మ‌హిళ త‌న ఇంటికి మ‌ర‌మ్మ‌త్తులు చేస్తుండ‌గా వందేళ్ల నాటి డైరీ మిల్క్ ర్యాపర్‌ను క‌నుగొన్నారు..

Viral: ఇల్లు రిపేర్ చేయిస్తుండగా దొరికిన 100 ఏళ్ల నాటి డైరీ మిల్క్.. ఓపెన్ చేసి చూడగా..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2023 | 1:50 PM

లండన్‌లో ఓ మ‌హిళ త‌న ఇంటికి మ‌ర‌మ్మ‌త్తులు చేస్తుండ‌గా వందేళ్ల నాటి డైరీ మిల్క్ ర్యాపర్‌ను క‌నుగొన్నారు. ఆ ర్యాప‌ర్‌ను చూసి ఆమె షాకయ్యారు. ఎమ్మా యంగ్ త‌న బాత్‌రూం రినోవేష‌న్ చేస్తుండ‌గా ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉన్న డైరీ మిల్క్ ర్యాప‌ర్‌ను గుర్తించారు. కంపెనీ ప్రతినిధుల‌ను ఎమ్మా సంప్రదించ‌గా ఇది 1930-34 నాటిద‌ని వారు తెలిపారు.

అప్పట్లో చాక్లెట్ బార్ ధ‌ర కేవ‌లం 6 పెన్స్ మాత్రమే. ర్యాప‌ర్‌పై గోల్డ్ క‌ల‌ర్‌లో క్యాడ్‌బ‌రీస్ డైరీ మిల్క్ చాక్లెట్ నియాపోలిట‌న్ అని రాసి ఉంది. ఎమ్మా పూర్వీకులు ఆ ఇంటిని 1932లో నిర్మించారట. వందేళ్లయినా చాక్లెట్ బార్ అదే కండిష‌న్‌లో ఉండటం చూసి ఆశ్చర్యపోయినట్లు ఎమ్మా చెప్పుకొచ్చారు. చాక్లెట్ ఓ వైపు ఎలుక కొరికిన‌ట్టుగా ఉంద‌ని మిగిలిన భాగం షెల్ఫ్‌లో పెట్టిన‌ట్టుగా ఉంద‌ని అన్నారు. ఈ చాక్లెట్‌ని బోర్న్‌విల్లే కంపెనీ ఇంగ్లండ్‌లో త‌యారుచేసినట్లు రాసి ఉంది.

ఈ క్యాడ్‌బ‌రీ రాపర్‌ చ‌రిత్రను తిరిగి జ్ఞప్తికి తెచ్చిందని క్యాడ్‌బ‌రీ ప్ర‌తినిధి తెలిపారు. బ్రిటిష్ సంస్కృతిలో క్యాడ్‌బ‌రీకి 200 ఏళ్ల వార‌స‌త్వం ఉంద‌ని ప్ర‌జ‌ల జీవితాల్లో త‌మ చాక్లెట్ చెర‌గ‌ని ముద్ర వేసింద‌ని 1930ల నాటి డైరీ మిల్క్ నియోపాలిట‌న్‌ అప్పట్లో చాలా పాపులర్ అని అన్నారు.(Source)