గంట పనికి రూ. కోటి జీతం.. గూగుల్ ఇంజనీర్ ఉద్యోగంపై సర్వత్రా ఆసక్తి.. ఇంతకీ విషయం ఏంటంటే..

ఇప్పుడు ఆయన వార్త సర్వత్రా వ్యాపిస్తోంది. చాలా మంది కోడింగ్ ఇంజనీర్లు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. పని గంటలను అలాగే ఉంచండి.. అవసరమైతే తక్కువ చెల్లించండి. మేం సిద్ధంగా ఉన్నాం అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇది నా డ్రీమ్ జాబ్. ఈ ఉద్యోగం కోసం కష్టపడుతున్నాను. మీ కష్టాన్ని గుర్తించే మీకు ఈ ఉద్యోగం ఇచ్చారని మరో ఉద్యోగి వ్యాఖ్యానించారు.

గంట పనికి రూ. కోటి జీతం.. గూగుల్ ఇంజనీర్ ఉద్యోగంపై సర్వత్రా ఆసక్తి.. ఇంతకీ విషయం ఏంటంటే..
Google Engineer
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2023 | 9:29 PM

నెలవారీ జీతం పొందడానికి ప్రతిరోజూ కనీసం 8 నుండి 9 గంటల పని తప్పనిసరి. ఇందులో ఎక్కువ తేడాలు వస్తే జీతంలో కోత విధిస్తారు. పనిలో సమయపాలన తప్పనిసరి. కానీ, ఇక్కడ Google ఇంజనీర్ ప్రతిరోజూ 1 గంట మాత్రమే పని చేస్తాడు. కానీ, అతని వార్షిక వేతనం రూ.1.24 కోట్లు. ఇప్పుడు అందరూ ఇంజినీర్ల చూపు అతడి పనిపైనే పడింది. అదే ఉద్యోగానికి కాస్త తక్కువ జీతంతో దరఖాస్తు చేసుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. డెవాన్‌కు చెందిన 20 ఏళ్ల టెక్కీ అదృష్టవంతుడు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఉద్యోగం కోసం ఆశపడతారు. ఎందుకంటే అతను రోజుకు 1 గంట మాత్రమే పని చేస్తాడు. అంటే నెలకు 24 నుంచి 28 గంటల పని మాత్రమే. వార్షిక వేతనం రూ.1.24 కోట్లు. 1 గంట పని ముగించిన తర్వాత అతను కావాల్సినంత ఎంజాయ్‌ చేస్తాడు. బీచ్‌లు, పార్క్‌లు సహా రోజూ అనేక జాలీ రైడ్స్‌ చేస్తాడు. మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా?

ప్రపంచ దిగ్గజ టెక్‌ కంపెనీ గూగుల్‌. ఇందులో ఉద్యోగం రావటం అదృష్టంగా భావిస్తారు చాలా మంది యువతీ యువకులు. అందినకాడికి రెఫరెన్స్‌లు కూడా చేయించుకుంటారు. గూగుల్‌లో జాబ్‌ కొడితే లైఫ్‌లో సెటిల్‌ అయిపోయినట్టే అని భావిస్తారు. అలాగే, డెవాన్గూ అనే యువకుడు గుల్‌లో కోడింగ్ విభాగంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతను తన కోడింగ్‌ను 1 గంటలో ముగించి, రోజంతా సుఖంగా ఉండగలడు. ఈ సంస్థ కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడం లేదు. ఎందుకంటే కోడింగ్ ఇంజనీర్లు ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి జంప్ చేస్తారు. దీంతో కంపెనీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ సమస్యలన్నింటిని నివారించడానికి, ఇంజనీర్లను తమ కంపెనీలో ఉంచడానికి గూగుల్ కూడా ప్రయోగాలు చేస్తోంది.

తాను వేగంగా పని చేస్తాను. కష్టపడి పనిచేసే వ్యక్తిని కాదు. అలా అయితే నేను వేరే స్టార్టప్ కంపెనీలో ఉండేవాడిని. ఎక్కువ గంటలు పని చేయాలనే ఒత్తిడి తనకు లేదని డెవాన్ చెప్పాడు. ఇప్పుడు ఆయన వార్త సర్వత్రా వ్యాపిస్తోంది. చాలా మంది కోడింగ్ ఇంజనీర్లు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యూ కడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పని గంటలను అలాగే ఉంచండి.. అవసరమైతే తక్కువ చెల్లించండి. మేం సిద్ధంగా ఉన్నాం అంటూ పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇది నా డ్రీమ్ జాబ్. ఈ ఉద్యోగం కోసం కష్టపడుతున్నాను. మీ కష్టాన్ని గుర్తించే మీకు ఈ ఉద్యోగం ఇచ్చారని మరో ఉద్యోగి వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..