అయ్యో.. ఏంటి ఇలా జరిగింది.. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రైడర్ విమానం
సరదా కోసం చేసిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ రైడింగ్ అనుకోని సంఘటనకు దారితీసింది. జార్ఖండ్ లోని ఓ గ్లైడర్ విమానం ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ లోని ధన్ బాడ్ జిల్లాలో ఓ ప్రైవేటు గ్లైడర్ ప్లేన్ రైండింగ్ ను ప్రారంభించారు.
సరదా కోసం చేసిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ రైడింగ్ అనుకోని సంఘటనకు దారితీసింది. జార్ఖండ్ లోని ఓ గ్లైడర్ విమానం ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ లోని ధన్ బాడ్ జిల్లాలో ఓ ప్రైవేటు గ్లైడర్ ప్లేన్ రైండింగ్ ను ప్రారంభించారు. ఇందులో ఎవరైనా ప్రయాణిస్తే ఆ పట్టణం మొత్తం ఆ ప్లేన్ లో తిరిగి చూసేయచ్చు. అయితే బిహార్ లోని పాట్నా కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు జార్ఖండ్ లోని ధన్ బాడ్ లో ఉంటున్న తన అంకుల్ ఇంటికి వచ్చాడు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్లేన్ రైండింగ్ చేసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. చివరికి అక్కడికి చేరుకుని ఆ ప్లేన్ ను ఎక్కేశాడు. గురువారం రోజున సాయంత్రం 4.50 PM గంటలకు ఆ ప్లేన్ బర్వడ్డా ఎయిర్ స్ట్రిప్ నుంచి బయలుదేరింది. అలా కొద్ది దూరం గాల్లో ఎగిరాక ఆ ప్లేన్ అదుపుతప్పింది. దీంతో నీలేష్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి ఆ ప్లేన్ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఆ 14 ఏళ్ల బాలుడికి, పైలట్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ ప్లేన్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అయితే నీలేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు ఇంటి లోపల ఆడుకుంటున్నారని ప్లేన్ తన ఇంటిని క్రాష్ చేయగానే వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలుపాలైన ఆ బాలుడు, పైలట్ లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు టెక్నికల్ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు
VIDEO: #Jharkhand में धनबाद एयरपोर्ट से उड़ान भरते ही क्रैश हुआ ग्लाइडर, घर पर आकर गिरा; 2 लोग घायल pic.twitter.com/vJ7QUHtXYO
— NDTV India (@ndtvindia) March 23, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..