అందుకే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలు.. భూకంపం వచ్చినా ఆగకుండా సర్జరీ చేశారు.

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం రాత్రి భూకంపం రావడం అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.

అందుకే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలు.. భూకంపం వచ్చినా ఆగకుండా సర్జరీ చేశారు.
Doctors
Follow us
Aravind B

|

Updated on: Mar 22, 2023 | 11:11 AM

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం రాత్రి భూకంపం రావడం అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. దాదాపు కొన్ని సెంకడ్ల పాటు భూమి కంపించడంతో ఆందోళన చెందారు. అయితే అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహర అనే ఆసుపత్రిలో ఓ సర్జరీ జరుగుతోంది. ఆ సమయంలోనే ఒక్కసారిగా భూమి కంపించడంతో వైద్యులు ఆందోళ చెందారు. అయినప్పటికీ తమ సర్జరీని కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్యుల పై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ కు ఆగ్నేయ దిశగా దాదాపు 6.6 మ్యాగ్నిట్యూట్ తో భూకంపం సంభవించినట్లు యూఎస్ జీయోలాజికల్ సర్వీసస్ వెల్లడించింది. సుమారు 190 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని పేర్కొంది. అయితే ఈ భూకంప ప్రభావం ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించింది. ఢిల్లీ, కశ్మీర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల ప్రజలు భూకంప ప్రకంపనలు ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..