Viral Video: మీరు సమోసా ప్రియులా.. బెండకాయ మసాలా సమోసాన్ని ఎప్పుడైనా రుచి చూసారా..!

భారతీయులకు స్నాక్ ఐటెం సమోసా అంటే పిచ్చి ప్రేమ. సీజన్‌తో సంబంధం లేకుండా.. ఈ సమోసాని ఇష్టంగా తింటారు. ఆలు సమోసా, ఉల్లి సమోసా, కార్న్ సమోసా ఇలా చాలా రకాల సమోసాలు మార్కెట్ లో లభిస్తాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న సమోసా వీడియోను చూస్తే వామ్మో అని అంటారు..

Viral Video: మీరు సమోసా ప్రియులా.. బెండకాయ మసాలా సమోసాన్ని ఎప్పుడైనా రుచి చూసారా..!
Bhindi Samosa
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2023 | 1:39 PM

లాక్డౌన్ సమయంలో ప్రజలకు వివిధ రకాల పనులను చేయడం..వాటిని వీడియాలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారింది. ముఖ్యంగా ఆహార ప్రయోగాలు అలవాటు మరీ ఎక్కువైంది. పురాతన కాలం నుంచి ఆహారం మీద భిన్నమైన ప్రయోగాలు చేయడం అలవాటు.. అయితే అప్పుడు తినే ఆహారాన్ని మరింత రుచిగా మార్చడం కోసమే చేసేవారు.. అయితే అందుకు భిన్నంగా తాము చేసే భిన్నమైన ప్రయోగాలతో వార్తల్లో నిలబడానికి చేస్తున్నారు. దీంతో కొన్ని సార్లు ఆ వంటలవైపు చూడాలన్నా భయపడాల్సిందే.. ఇలాంటి భిన్న ఆహారపదార్ధాల ప్రయోగాలకు చెందిన వీడియోలు అనేకం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆహారపు వంటల వీడియో మార్కెట్ లోని వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు తయారు చేస్తున్న వ్యక్తిపై విరుచుకుపడుతున్నారు. తమ అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భారతీయులకు స్నాక్ ఐటెం సమోసా అంటే పిచ్చి ప్రేమ. సీజన్‌తో సంబంధం లేకుండా.. ఈ సమోసాని ఇష్టంగా తింటారు. ఆలు సమోసా, ఉల్లి సమోసా, కార్న్ సమోసా ఇలా చాలా రకాల సమోసాలు మార్కెట్ లో లభిస్తాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న సమోసా వీడియోను చూస్తే వామ్మో అని అంటారు.. ఎందుకంటే చాక్లెట్ మోమోస్, గులాబ్ జామూన్ పరాటాలు,   ఓరియో మ్యాగీ, భిండీ సమోసా ల్లానే వింత సమోసా అన్న మాట.. ఇది చూసిన సమోసా ప్రియులు అసహ్యంతో ముఖం పెడుతున్నారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బెండకాయ భిండీ సమోసా అమ్ముతూ కనిపించాడు. వైరల్వి క్లిప్ లో సమోసాను తెరిచి లోపల నింపుతున్నాడు విక్రేత. ఇందులో బంగాళదుంపకు బదులుగా బెండకాయ శ్టఫ్ ను నింపుతున్నాడు. తాను గత 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నానని, ప్రతిరోజూ పది గంటలకు ఇక్కడే తన దుకాణాన్ని ఏర్పాటు చేస్తానని దుకాణదారుడు వీడియోలో చెప్పాడు.

ఈ వీడియోను ఫుడ్ లవర్ అనే ఛానెల్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ సమోసాపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.  కొందరికి ఈ సమోసా బాగా నచ్చింది, అయితే ఈ వంటకాన్ని అస్సలు ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా దీన్ని రుచి చూడాలనుకుంటే, మీరు చాందినీ చౌక్‌లోని భగీరథ్ ప్యాలెస్‌కి వెళ్లాలి. అక్కడ ఈ వ్యక్తి మీకు బెండకాయ స్టఫ్డ్ సమోసాని అందిస్తాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..