King Cobra: గాల్లో విమానం.. పైలట్ సీటు కింద సడెన్‌గా ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

|

Apr 07, 2023 | 6:30 AM

ఫ్లైట్‌ లోపలికి ఎలా వచ్చిందోఏమో.. ఏకంగా పైలట్‌ సీటు కిందే దూరింది కింగ్‌ కోబ్రా. విమానం టేకాఫ్‌ అయినా కాసేపటికే బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఫ్లైట్‌లో సౌండ్స్‌ కావొచ్చని కొద్దిసేపు పట్టించుకోలేదు. తర్వాత నడుము దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించి..

King Cobra: గాల్లో విమానం.. పైలట్ సీటు కింద సడెన్‌గా ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
King Cobra
Follow us on

కింగ్‌ కోబ్రా.. దీన్ని చూస్తేనే కాదు, ఈ పేరు వింటేనే గుండెలు ఝల్లుమంటాయ్‌. అంత భయకరంగా ఉంటుందీ నల్లత్రాచు. ఇక కాటేసిందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. బతికి బట్టకట్టడం దాదాపు అసాధ్యమే!. అలాంటి కింగ్‌కోబ్రా.. ముందుకొచ్చి బుసలు కొడితే ఎలాగుంటది!. పై ప్రాణాలు పైనేపోవు. ఓ విమానం పైలట్‌కి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఫ్లైట్‌ లోపలికి ఎలా వచ్చిందోఏమో.. ఏకంగా పైలట్‌ సీటు కిందే దూరింది కింగ్‌ కోబ్రా. విమానం టేకాఫ్‌ అయినా కాసేపటికే బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఫ్లైట్‌లో సౌండ్స్‌ కావొచ్చని కొద్దిసేపు పట్టించుకోలేదు. తర్వాత నడుము దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించి చెక్‌చేస్తే మైండ్‌బ్లాంకైంది పైలట్‌కి. గుండె ఆగినంతపనైంది. బుసలుకొడుతున్న కింగ్‌ కోబ్రాను చూసి హడలిపోయాడు. అయితే, ధైర్యం తెచ్చుకొని చాకచక్యంగా వ్యవహరించాడు. పైలట్‌ అక్కడ్నుంచి పక్కకు జరగడంతో అది సీటు కిందకి వెళ్లిపోయింది. దాంతో, ధైర్యం కూడగట్టుకొని గ్రౌండ్‌ కంట్రోల్‌కి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశాడు పైలట్‌ ఎరామస్‌. పైలట్‌ ధైర్యసాహసాలతో అతనితోపాటు ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. దక్షిణాఫ్రియా జోహెన్నెస్‌బర్గ్‌లో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది.

ప్రయాణికులంతా దిగిన తర్వాత కాక్‌పిట్‌ను చెక్‌చేస్తే సీటు కింద చుట్టుకొని పడుకుని కనిపించింది కింగ్‌ కోబ్రా. పైలట్‌ సమయస్ఫూర్తితో పెనుప్రమాదం తప్పినట్టయ్యింది. ముందురోజు విమానం రెక్కల కింద కింగ్‌కోబ్రాను గుర్తించారు ఎవియేషన్‌ సిబ్బంది. అయితే, దాన్ని పట్టుకునేలోపే తప్పించుకుంది. ఆ తర్వాత కాక్‌పిట్‌లో ప్రత్యక్ష్యమైంది. అప్పుడు మరోసారి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే మళ్లీ తప్పించుకుంది. విమానం మొత్తం చెక్‌చేసినా కోబ్రా కనిపించలేదు. దాంతో, కోబ్రా ఫ్లైట్‌లో నుంచి వెళ్లిపోయిందని భావించారు. కానీ, అనూహ్యంగా విమానం టేకాఫ్‌ అయ్యాక పైలట్ సీటు కింద నుంచి బుసలు కొట్టడంతో కోబ్రా బయటపడింది. ఇలాంటి ఇన్సిడెంట్‌ను ఎప్పుడూ చూడలేదంటున్నారు ఏవియేషన్‌ నిపుణులు. పైలట్‌ థైర్యంగా వ్యవహించాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..