సమ్మర్‌ స్పెషల్.. ‘పరాటా ఐస్ క్రీమ్’ వీడియో వైరల్‌.. ఒక్కొక్కరి రియాక్షన్‌ చూడాలి భయ్యా…!

పచ్చి పరాటా పిండిపై పెట్టాడు. ఆ తర్వాత పిండిని ఐస్‌క్రీం కోన్‌ చూట్టూ తిప్పి పిండిని ముద్దలా తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత మరోమారు పరోటాను రోల్‌ చేశాడు. ఆ తర్వాత కావాల్సినట్టుగా కాల్చుకున్నాడు. విచిత్రమైన వంటకం నెటిజన్ల హృదయాలను..

సమ్మర్‌ స్పెషల్.. 'పరాటా ఐస్ క్రీమ్' వీడియో వైరల్‌.. ఒక్కొక్కరి రియాక్షన్‌ చూడాలి భయ్యా...!
Ice Cream Paratha
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2023 | 4:20 PM

ఇది ఎండాకాలం… మామిడి పళ్లు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ ల సీజన్ కదా? అయితే, ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఒక వింత వంటకం సంచలనం సృష్టించింది. అది’పరాటా ఐస్‌క్రీమ్’.. అవును మీరు చదివింది నిజమే. పరాటా ఐస్‌క్రీమ్‌ గురించి మీకు ఖచ్చితంగా తెలియదు. కార్నెట్టో ఐస్‌క్రీమ్‌తో దేశీ పరాఠాను తయారుచేసే వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇది జీర్ణించుకోవడానికి వింతగా ఉన్న ఫుడ్ ఫ్యూజన్‌ని గుర్తించిన నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. మీరు దీన్ని రుచి చూడాలనుకుంటున్నారా? అయితే, ఈ క్రింది వీడియోపై ఓ లుక్కేయండి.

మహ్మద్ ఫ్యూచర్‌వాలా అనే వినియోగదారు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పైగా ఆ వీడియోకి క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.. పరాటాకు కూరగాయలను కలపడం పాత ఫ్యాషన్‌. “ఆలూ, గోబీ, పనీర్ పరాఠా పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. కాలంతో పాటు.. కార్నెట్టో ఐస్ క్రీమ్ పరాఠా కాలం వచ్చేసింది అంటూ వైరల్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆహార తయారీ వీడియోలో వినూత్నమైన చెఫ్ ఒక కార్నెట్టో ఐస్‌క్రీమ్‌ కోన్ కవర్‌ తీసేసి..దానిని సిద్ధం చేసిన పచ్చి పరాటా పిండిపై పెట్టాడు. ఆ తర్వాత పిండిని ఐస్‌క్రీం కోన్‌ చూట్టూ తిప్పి పిండిని ముద్దలా తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత మరోమారు పరోటాను రోల్‌ చేశాడు. ఆ తర్వాత కావాల్సినట్టుగా కాల్చుకున్నాడు. విచిత్రమైన వంటకం నెటిజన్ల హృదయాలను గెలుచుకోలేదు. విచిత్రమైన వంటకంపై నెటిజన్లు అసహ్యం వ్యక్తం చేస్తూ ట్వీట్‌కు సమాధానమిచ్చారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..