Prank Video: తిరగబడిన ప్రాంక్.. యూట్యూబర్‌పై కాల్పులు జరిపిన యువకుడు.. కట్ చేస్తే..
ప్రాంక్ వీడియో ఇప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇలా చేస్తున్నప్పుడు చిన్న పొరపాటు జరిగిన సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇలాంటి మిస్టెక్ అమెరికాలో జరిగింది. దీంతో కాల్పులు.. గాయాలు.. పోలీసుల ఎంట్రీ.. అసలు ఏం జరిగిందో ఇక్కడ చూడండి..
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ కావడానికి రకరకాలుగా ప్రయాత్నాలు చేస్తున్నారు కంటెంట్ క్రియేటర్లు. కంటెంట్ సృష్టికర్తలు వివిధ రకాల వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది కంటెంట్ సృష్టికర్తలు ఒక విషయంపై అనేక వీడియోలను చేయడానికి ఇష్టపడతారు. ఇందులో కొన్ని ఆశ్చర్య పరుస్తుండగా.. మరికొన్ని చిలిపి వీడియోలు వాటిలో ఉంటున్నాయి. 1999 సంవత్సరంలో MTVలో “MTV బక్రా” అనే రియాలిటీ షో ప్రసారమైనప్పుడు భారతదేశంలో ప్రాంక్ వీడియోల ట్రెండ్ ఎక్కువగా ఉంది. దీనిని సైరస్ హోస్ట్ చేశారు. ఈ షోలోనూ సెలబ్రిటీలే కాకుండా టీమ్ మెంబర్స్ దారిలో ఉన్న వాళ్లతో కాస్త చిలిపిగా ఆడేవారు. చాలా సార్లు కొంతమందికి చాలా కోపం వచ్చేస్తుంటుంది.. వెంటనే మీరు కెమెరాలో ఉన్నారని.. ఇది కేవలం జోక్ అని చెప్పేస్తుంటారు. ఇలా వారు ప్రమాదం నుంచి తప్పించుకుంటారు.
అయితే, ఈ రోజుల్లో ప్రాంక్ వీడియోలు చేయడం సాధారణ విషయంగా మారింది. మీకు సోషల్ మీడియాలో లక్షల వీడియోలు కనిపిస్తాయి. కొందరికి ఇలాంటి ప్రాంక్ వీడియోలతో చాలా కోపం వస్తుంది. అంతేకాదు, ఇలా చేసేవారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, ఒక అమెరికన్ యూట్యూబర్ చేసిన చిన్న ప్రాంక్ వీడియో చేస్తుండగా ఎదుటి వ్యక్తికి కోపం వచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులు జరిపాడు. అవును, మీరు చదవింది నిజమే.. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న యూట్యూబర్ టాన్నర్ కుక్‌తో ఇలా జరిగింది. అతను ఇప్పుడు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు ముందు, తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాల్పుల వీడియో ఇంకా బయటకు రాలేదు. వైరల్ అయిన ఈ వీడియోను ముందుగా మీరు చూడండి..
వీడియోలను ఇక్కడ చూడండి
The moment police apprehended shooting Suspect at Dulles Town Center today pic.twitter.com/shv0cjQm8k
— VAhiphopandnews (@VAhiphopandnewz) April 2, 2023
ఎలా ఎందుకు కాల్పులు జరిగాయంటే..
ప్రాంక్ వీడియో చేస్తున్న సమయంలో కాల్పులు ఎందుకు జరిగాయో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. నిజానికి టాన్నర్ కుక్ యూట్యూబ్‌లో క్లాసిఫైడ్ గూన్స్ అనే పేరుతో తన స్వంత ఛానెల్‌ని నడుపుతున్నాడు. దీనిపై తరచూ ప్రాంక్ వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటాడు. అతని ఛానెల్‌కు దాదాపు 43 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.. ఏప్రిల్ 2న టాన్నర్ ప్రాంక్ వీడియో చేయడానికి వర్జీనియాలోని స్టెర్లింగ్‌లోని డల్లెస్ టౌన్ సెంటర్ మాల్‌కు వచ్చారు. అతను వీడియో తీస్తుండగా, అతను 31 ఏళ్ల అలాన్ కోలీని సంప్రదించాడు. టాన్నర్ ప్రాంక్ చేస్తున్నప్పుడు, అతని స్నేహితుడు దూరం నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. టాన్నర్ ప్రాంక్ చేయడం అలెన్‌కు నచ్చలేదు. అతను టాన్నర్‌పై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
తరువాత ఏం జరిగింది..
ఈ ఘటనలో టాన్నర్ ఆసుపత్రి పాలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు డల్లెస్ టౌన్ సెంటర్‌కు చేరుకుని కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత నిందితుడు అలెన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పుడు అలెన్ షాపింగ్ సెంటర్‌లోని ఫుడ్ కోర్ట్‌లో పిస్టల్‌తో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అమెరికన్ మీడియా అందించిన సమాచారం ప్రకారం, ఫుడ్ కోర్ట్‌లో టాన్నర్, అలెన్ మధ్య గొడవ జరిగిందని, దాని కారణంగా కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
యూట్యూబర్ ఏం చెశారంటే..
కాల్పులు జరిపి చికిత్స పొందుతున్న అమెరికాకు చెందిన యూట్యూబర్ టాన్నర్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ‘నేను కేవలం ప్రాంక్ చేశాను. ఆ వ్యక్తి దానిని సీరియస్‌గా తీసుకున్నాడు. షూటింగ్‌కి ముందు ఏం మాట్లాడలేదు. నేరుగా కాల్చారు. కాల్పుల అనంతరం మాల్‌లో గందరగోళం నెలకొంది..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం