TSPSC: టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన.. మరో పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం.. ఎందుకంటే

టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసినట్లుగా టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఇప్పటికే నాలుగు పరీక్షలు వాయిదా వేసిన కమీషన్.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి పరీక్షలుఎప్పుడు నిర్ణయిస్తారనేది ప్రకటించలేదు.

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ మరో కీలక ప్రకటన.. మరో పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం.. ఎందుకంటే
Tspsc
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 28, 2023 | 8:54 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంతో కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన కమీషన్.. తాజాగా టీఎస్​పీఎస్సీ నిర్వహించే హార్టికల్చర్​ ఆఫీసర్​ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల 4 పరీక్షలను రద్దు చేయగా.. రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(డీఏవో), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలు రద్దయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

సుదీర్ఘకాలం తీసుకోకుండా స్వల్ప వ్యవధిలోనే తిరిగి హార్టికల్చర్‌ పరీక్ష నిర్వహించేందుకు అనువైన తేదీలను కమిషన్‌ పరిశీలిస్తోంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.