Telangana: సెల్‌ఫోన్‌ దొంగలకు ఇక చుక్కలే.. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం..

తెలంగాణలో ఇకపై సెల్‌ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్టే. ఎందుకంటే ఇప్పుడు సీఐడీ రంగంలోకి దిగుతోంది. దిగడమే కాకుండా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని 'సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ CIER' తో ఒప్పందం కుదుర్చుకుని మొబైల్ చోరుల ఆట కట్టించనుంది.

Telangana: సెల్‌ఫోన్‌ దొంగలకు ఇక చుక్కలే.. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం..
Police Recover Mobile Phones
Follow us
Venkata Chari

|

Updated on: Mar 28, 2023 | 9:16 PM

తెలంగాణలో ఇకపై సెల్‌ఫోన్ దొంగలకు కాలం చెల్లినట్టే. ఎందుకంటే ఇప్పుడు సీఐడీ రంగంలోకి దిగుతోంది. దిగడమే కాకుండా కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ CIER’ తో ఒప్పందం కుదుర్చుకుని మొబైల్ చోరుల ఆట కట్టించనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మొబైల్‌ ఫోన్ చోరీ అయినట్లు ఫిర్యాదు ఇచ్చినా.. పోలీసుల నుంచి అంతగా స్పందన ఉండదు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌ పట్టుకునేంత సమయం, దానికి సరైన వ్యవస్థ మన పోలీసుల వద్ద లేకపోవడమే. ధనవంతులకు ఫోన్ చోరీ అవ్వడం పెద్ద నష్టం కాకపోవచ్చు. కానీ పేద, మధ్యతరగతి వాళ్లకు మొబైల్ ఫోన్ ఓ లగ్జరీ. ఎన్నో నెలలు కష్టపడి.. నెలనెల ఈఎంలు చెల్లిస్తూ సెల్‌ఫోన్ కొంటుంటారు. అలాంటి ఫోన్‌ను అకస్మాత్తుగా ఎవరో ఎత్తుకెళ్తే..? అందుకే వీరి బాధను అర్థం చేసుకున్న తెలంగాణ పోలీసులు మొబైల్ ఫోన్ చోరీలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సీఐడీ విభాగం రంగంలోకి దిగుతోంది.

రాష్ట్ర సీఐడీ విభాగం.. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఈఐఆర్)’ తో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. సీఈఐఆర్ సాయంతో చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాదు.. అందులో వేరే సిమ్‌కార్డు వేయడానికి ప్రయత్నిస్తే.. ఇట్టే వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, బెంగళూరు పోలీసులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేసి మొబైల్ ఫోన్‌ దొంగల్ని పట్టుకుంటున్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇది అమల్లోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..