Chain Snatchers Arrest: హైదరాబాద్‌లో హడలెత్తించిన చైన్ స్నాచర్ల అరెస్టు.. గంటల్లోనే ఛేదించిన తెలంగాణ పోలీసులు
హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చైపన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ముఠాలు దొంగతనాలకు పాల్పడటంతో కలకలం రేపుతోంది..
హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చైపన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయి. పలు ప్రాంతాల్లో ముఠాలు దొంగతనాలకు పాల్పడటంతో కలకలం రేపుతోంది. చైన్ స్నాచర్లు నగరంలో హడలెత్తిస్తున్నారను. నగరంలోకి ఎంటర్ అయిన ముఠా సభ్యులు వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నారు. భారీ ఎత్తున దోచుకుంటున్నారు. కేవలం రెండు గంటల్లోనే ఆరు దొంగతనాలతో హడలెత్తించారు. అయితే వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా, ఎట్టకేలకు పోలీసు చేతికి చిక్కారు. వీరు కాచిగూడ నుంచి ట్రైన్‌లో వెళ్తుండగా, కాజీపేట వద్ద వరంగల్ టాస్క్‌ఫోర్స్ పో లీసులు అదుపులో తీసుకున్నట్లు వరంగడల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
ఈ దొంగత ముఠా సభ్యులతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ చైన్ స్నాచింగ్ ముఠా ఉప్పల్ పరిధిలోనే 2 చైన్ స్నాచింగ్, ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో దుండగులు మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కెళ్లారు. అనంతరం ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్ కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు. ఆ తర్వాత నాచారంలోని నాగేంద్రనగర్‌లో, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్‌లో, చిలకలగూడ రామాలయం వీధిలో, రాంగోపాల్ పేట్ పరిధిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇలా వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనకు గురి చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి