Watch Video: బైక్‌ ఎక్కలేదనే కోపంతో యువకుడి పైశాచికం.. యువతి తలపై హెల్మెట్‌తో దాడి.. వీడియో వైరల్‌

సదరు వ్యక్తి మహిళను హెల్మెట్‌తో కొట్టడం వీడియోలో కనిపించింది. ఫుటేజీ ప్రకారం, అతని చుట్టూ ఉన్న కొంతమంది స్థానికులు జోక్యం చేసుకుని వెంటనే అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. నిందితుడు, యువతి..

Watch Video: బైక్‌ ఎక్కలేదనే కోపంతో యువకుడి పైశాచికం.. యువతి తలపై హెల్మెట్‌తో దాడి.. వీడియో వైరల్‌
Man Hit A Young Woman
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 07, 2023 | 1:57 PM

ఢిల్లీలో కారుతో యువతిని ఈడ్చుకెళ్లిన ప్రమాద ఘటన మరువక ముందే.. హర్యానాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. బైక్‌పై కూర్చోవడానికి నిరాకరించినందుకు ఓ వ్యక్తి యువతిని హెల్మెట్‌తో కొట్టాడు. గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ సిసిటివి ఫుటేజీ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌పై తనతో ప్రయాణించడానికి నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు.

ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడంతో సదరు వ్యక్తి మహిళను హెల్మెట్‌తో కొట్టడం వీడియోలో కనిపించింది. ఫుటేజీ ప్రకారం, అతని చుట్టూ ఉన్న కొంతమంది స్థానికులు జోక్యం చేసుకుని వెంటనే అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. నిందితుడు, యువతి ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన వారేనని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ACP మనోజ్ తెలిపిన వివరాల మేరకు…కమల్ అనే వ్యక్తి తనతో పాటు బైక్‌పై ప్రయాణించడానికి నిరాకరించినందుకు తమ ఇంటిపక్కనే నివసిస్తున్న ఈ మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.